స్టార్‌ హీరోయిన్‌ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన బద్రి సినిమాతో అమీషా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ అమ్మడి అందానికి అప్పటి యూత్ అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అనంతరం అమీషా కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది కానీ అనుకున్నంత మేర విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.


దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు వెళ్ళింది. అక్కడ ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక అమీషా తాను నటించిన సినిమాల కన్నా వివాదాలతోనే ఫేమస్ అయ్యింది. అమీషా వ్యక్తిగత విషయానికి వస్తే ఈమెకు 49 ఏళ్లు. ఇప్పటికీ వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. పెళ్లి మాట అసలే ఎత్తడం లేదు. కానీ గతంలో కొంతమంది అబ్బాయిలతో రిలేషన్ కొనసాగించిందంటూ జోరుగా ప్రచారాలు జరిగాయి.


అంతేకాకుండా కొంతమందితో ప్రేమాయణం నడిపిస్తుందని, వివాహం చేసుకుంటుందని ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదు. ఇక రీసెంట్గా సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఓ యువకుడితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలలో అమీషా అతడి కౌగిలిలో ఒదిగిపోతూ తన పరవశాన్ని అంటూ ఫోటో కింద రాసుకోచ్చింది. ఇక ఆ అబ్బాయి విషయానికి వస్తే.... ఆ అబ్బాయి వయసు 30 ఏళ్లు.


వీరిద్దరి మధ్య 19 ఏళ్ల వయసు తేడా ఉంది. అతడు ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. అతని పేరు నీరవ్ బిర్లా. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఇంత ఎక్కువ వయసు ఉన్న అమ్మాయితో డేటింగ్ చేయాల్సిన అవసరం ఆ అబ్బాయికి ఏమి ఉందని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: