మెగా హీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు వీరు నాలుగైదు సంవత్సరాల క్రితం నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ వీరి ప్రేమ విషయాన్ని ఎక్కడా కూడా బయట పెట్టకుండా సీక్రెట్ గా ప్రేమాయణాన్ని నడిపించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఒప్పించి గత సంవత్సరం జూన్ నెలలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. అదే సంవత్సరం నవంబర్ లో డెస్టినేషన్ వివాహాన్ని ఇటలీలో గ్రాండ్ గా జరుపుకున్నారు.


అనంతరం హైదరాబాద్ తెలియవచ్చి రిసెప్షన్ చేసుకున్నారు. ఇక రీసెంట్ గా లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ మొదటి సంవత్సరం యానివర్సరీ జరుపుకున్నారు. కాగా వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా సినిమాతో ఈరోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అటు లావణ్య త్రిపాఠి వివాహానికి ముందు నటించిన వెబ్ సిరీస్ లను రిలీజ్ చేసింది. కానీ వివాహం జరిగే సంవత్సరం అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలలో నటించలేదు.


సినిమాలు చేస్తుందా లేదా అనే విషయంపై ఇంతవరకు లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లావణ్య త్రిపాఠి వివాహానికి ముందు చాలా సినిమాలు చేసింది. తాను సినిమాలలో నటిస్తున్న సమయంలో లావణ్య చేస్తున్న సినిమాలోని హీరోకి, లావణ్యకు మధ్య మంచి స్నేహం ఏర్పడిందట.


హీరో లావణ్య త్రిపాఠిపై ఇష్టాన్ని పెంచుకొని ప్రేమిస్తున్నానని కొన్ని రోజులకు తన ప్రేమ విషయాన్ని చెప్పాడట. కానీ లావణ్య త్రిపాఠి ఆ హీరో ప్రేమ విషయాన్ని సున్నితంగా రిజక్ట్ చేసిందట. దానికి గల కారణం అప్పటికే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారు. కానీ వారి ప్రేమ విషయాన్ని ఎప్పుడూ కూడా బయట పెట్టలేదు. ప్రస్తుతం ఈ జంట వివాహం చేసుకొని వారి వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: