అయితే, అలా ఎదురు చూసి చూసి ఫాన్స్ అయితే విసిగిపోయారు మరి! దాంతోనే ఇపుడు ప్రభాస్ ఫాన్స్ జంట ఒకటి హీరో సంగతి కాసేపు పక్కనబెట్టి వైవాహిక జీవితం ద్వారా ఒక్కటౌతున్నారు. అవును, ప్రభాస్ పెళ్లి దేవుడికెరుకగాని మేము మాత్రం ఇంకెన్నాళ్లు దూరంగా ఉండేది అని అనుకున్నారేమో ఏమో... త్వరలో ప్రభాస్ ఫాన్స్ జంట ఒకటి వివాహంతో ఒక్కటవుతున్నారు. పాకిస్థాన్, అమెరికాకు చెందిన ఈ జంట దాదాపు రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియా వేదికగా కలుసుకున్నారు. ఈ క్రమంలో వారి భావాలు కూడా కలవడంతో త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వారి పేర్లు లారెన్, రియాజ్. రియాజ్ పాకిస్థాన్ కి చెందిన వ్యక్తి కాగా లారెన్ అమెరికాకు చెందిన వ్యక్తి. దాంతో వీరికి డార్లింగ్ ప్రభాస్ ఫాన్స్ విషెష్ చెబుతున్నారు. మరికొంతమంది 'డార్లింగ్ ఎలాగూ చేసుకోవడం లేదు... మీరైనా పెళ్లి చేసుకొని సుఖంగా ఉండండి!' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఇక్కడ ఓ విషయం ప్రస్తావించాలి. కొన్నాళ్ల క్రితం ప్రభాస్ ఈటీవీలో ప్రసారమవుతోన్న సిరివెన్నెల ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి అతిథిగా హాజరు కాగా, ఇందులో సీతారామశాస్త్రి రాసిన పెళ్లి పాటల ప్రస్తావన వచ్చింది. ‘మనీ’ అనే సినిమా కోసం ఆయన ‘భద్రం బీకేర్‌ఫుల్ బ్రదర్.. భర్తగా మారకు బ్యాచ్‌లర్’ అనే పాట రాశారు కదా. ఈ పాటలో శాస్త్రిగారు పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. ఆ తర్వాత చాలా సినిమాలలో పెళ్లి వద్దని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. దాంతో ఆయా పాటలు విన్న తర్వాత కన్ఫ్యూజన్లో పడిపోయా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా? చేసుకోకూడదా? అంటూ సరదాగా చమత్కరించారు ప్రభాస్. మరి ఆ మాటలు సీరియస్ గా తీసుకున్నాడో ఏమిటో మరి.. ఇంకా పెళ్లి ధ్యాస రాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.