మా మధ్య ప్రేమ లేదు దోమ లేదు అంటూ తిరుగుతూనే ఇంత తతంగాలు నడిపారా..? అంటూ ఘాటుగా కూడా స్పందించారు కొంతమంది జనాలు. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో అక్కినేని ఇంటికి కోడలుగా మారిన తర్వాత ఆ అమ్మాయిలు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ బాగా వైరల్ గా మారాయి . ఎవరైనా సరే ఏ అమ్మాయి అయినా సరే ఒకరింటికి కోడలుగా వెళుతుంది అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు . పుట్టింట్లో ఎలా ఉందో మెట్టినింట్లో అలానే ఉండాలి అంటూ ఆశ పెట్టుకుంటూ ఉంటారు. కానీ అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లే అమ్మాయిలకు ఆ అదృష్టమే ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఆ స్థానం మాజీ అయిపోతుందో అన్న భయం అందరికీ ఉంటుంది అంటూ పరోక్షకంగా నాగార్జున మొదటి పెళ్లి రెండో పెళ్లి ని అదే విధంగా నాగచైతన్య మొదటి పెళ్లి రెండో పెళ్లిని గుర్తు చేస్తున్నారు .
మనకు తెలిసిందే లక్ష్మి - నాగార్జున మొదటి భార్య అయితే సోషల్ మీడియాలో ఆమె ఇప్పటికే ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంటుంది. నాగార్జున ఆమె జీవితాన్ని నాశనం చేశాడు అన్న వార్తల్లో ఎప్పుడూ నిలుస్తూనే ఉంటుంది . ఇక అమల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సోషల్ మీడియాలో ఆమె గురించి ఏం మాట్లాడాలన్నా నాగార్జున రెండో భార్య అంటూ ముందు ఒక ట్యాగ్ కనిపిస్తుంది. ఇక నాగచైతన్య గురించి చెప్పాల్సి వస్తే సమంత ప్రేమించి పెళ్లి చేసుకొని పట్టుమంటూ పదేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు . ఇప్పుడు శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య రెండో భార్యగా అడుగు పెట్టబోతుంది. దీంతో అక్కినేని ఫ్యామిలీ ఇంటి కోడలుగా అడుగుపెడితే వాళ్లకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ తప్పదు అని ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు . ఇక అఖిల్ అక్కినేని పరిస్థితి అటు రోలు కి ఇటు రోకలికి కాని పచ్చడిలా మిగిలిపోయింది అంటూ చాలా చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు..!