లావణ్య త్రిపాఠి మెగా ఇంటికోడలు అయ్యాక ఎందుకు సినిమాలో నటించడం లేదు..? మెగా ఫ్యామిలీ ఏమైనా లావణ్య కి కండిషన్ పెట్టిందా..? ఇక మళ్ళీ మేము తెరపై లావణ్యని హీరోయిన్గా చూడొచ్చా..? అంటూ పలు విధాలుగా ప్రశ్నించారు హోస్ట్ . ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ సైతం చాలా ఓపెన్ గా స్పందించారు . చాలా ఓపెన్ గా క్లారిటీ ఇచ్చారు . "సినిమాలు చేయడానికి ఆమె రెడీగా ఉంది . అయితే గతంలో వచ్చిన సినిమాలు ఇప్పుడు ఆమె నటించబోయే సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటున్నాను.. ఒకప్పుడు పాత్రకి ప్రయారిటీ ఉన్నా లేకపోయినా చేసుకుంటూ వచ్చేసింది . ఆ జర్నీ చాలా డిఫరెంట్. కానీ ఇప్పుడు ఆమెకు అవసరమే లేదు "..
"ప్రస్తుతం తను కంఫర్టబుల్ ప్లేస్ లో ఉంది . ఇప్పుడు ఏది పడితే అది చేయాల్సిన అవసరం తనకి లేదు . ప్రస్తుతం కధలు వింటుంది . కచ్చితంగా మంచి సినిమా వస్తే ఆమె నటిస్తుంది . పెళ్లి తర్వాత నటించకూడదు అనే కండిషన్ ఏమీ లేవు . ఆ మైండ్ సెట్ నుంచి ఎప్పుడో అందరు బయటికి వచ్చేసారు" అంటూ చెప్పుకు వచ్చాడు వరుణ్ తేజ్. కాగా వరుణ్ తేజ్ పరోక్షంగానే ఓ స్టార్ ఫామిలీ ని టార్గెట్ చేసినట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీకి సంబంధించిన హీరో..ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె సినిమాలో నటించింది . వెంటనే ఆమెకు డివర్స్ ఇచ్చేశారు . ఇదే విషయాన్ని పరోక్షంగా లేవదీశాడు వరుణ్ తేజ్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు..!