రీసెంట్ గా ఆమె నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్ అటు ఇటుగా ఉన్న..అయినా కానీ మరికొన్ని డిఫరెంట్ జోనర్ లో సినిమాలను ఓకే చేస్తుంది సమంత. తాజాగా రాంచరణ్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కే సినిమాని కూడా ఓకే చేస్తూ సైన్ చేసింది అన్న వార్త బాగా వైరల్ గా మారింది. కాగా ఇప్పుడు సమంతకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. శోభితా ధూళిపాళ్ల నాగచైతన్య పెళ్లిరోజు సమంత తన తెలుగు సినిమాకి సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది .
మనకు తెలిసిందే సమంత కు విడాకులు ఇచ్చిన తరువాత ఆయన శోభిత ధూళిపాళ్లని పెళ్లి చేసుకోబోతున్నారు. డిసెంబర్ 4వ తేది ఆయన అన్నపూర్ణయ స్టూడియోస్ లో శోభిత మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు. ఇక అదే రోజు ఆమె తాను కమిట్ అయిన సినిమా పూజ కార్యక్రమాలు కూడా చేయాలి అంటూ డైరెక్టర్ కి రిక్వెస్ట్ చేసిందట. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. తెలుగులో ఆమెకు అవకాశాలు రావు అంటూ హేళన చేసిన వాళ్లకి బుద్ధి వచ్చేలాగనే ఈ విధంగా చేయబోతుంది సమంత అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. కాగా మొదటి నుంచి సమంత అంతే..చాలా సైలెంట్ గానే ఉంటూ రివేంజ్ తీర్చుకుంటాది అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??