బాలయ్య సోలో హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమా వెనక ఎవరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ కథ ఉంది. ఇక ఈ సినిమాను భార్గవ్ ఆర్ట్స్ ఎస్. గోపాలరెడ్డి, కోడి రామకృష్ణ ఇద్దరు కలిసి మనువాస అనే తమిళ మూవీకి రీమేక్‌గా తెలుగులో చేయాలని భావించారు. ఇందులో బాలకృష్ణ హీరో అయితే బాగుంటుందని అనుకున్నారు .. ఆ సమయంలో బాలయ్యతో సినిమా అంటే ఎన్టీఆర్ కి కథ చెప్పాలి స్టోరీ చెప్పి ఆయనకు నచ్చేలా చేయటం వీరి తరం కాదు.. ఇక ఆ సమయంలో బాలకృష్ణకు స్వయంగా కథ చెప్పడంతో అది ఆయనకు నచ్చడంతో ఎన్టీఆర్ ని కూడా కథను వినమని అడిగారట.
ఇక తర్వాత బాలయ్యతో కలిసి ఎన్టీఆర్ కూడా కథ విని సినిమాలో భామ్మ పాత్రను పెంచి భానుమతి గారితో ఆ రోల్ చేయిస్తే సినిమా హిట్ అవుతుందని సలహా కూడా ఇచ్చారట అన్నగారు . అయితే ముందుగా ఈ సినిమాలో నటించడానికి భానుమతి ఒప్పుకోలేదట. ఎన్టీఆర్ ఫోన్ చేసి ఒప్పించారట అయితే సినిమా మొదలయ్యే సమయంలో ఎన్టీఆర్ , బాలకృష్ణకు మూడు కండిషన్లో పెట్టారట. 1.ఇందులో మొదటిది భానుమతి షూటింగ్ స్పాట్ కు రావడానికి అరగంట ముందే నువ్వు అక్కడ ఉండాలని అన్నారట .. 2. అలాగే ఆమె షూటింగ్ స్పాట్ కు రాగానే ఆమె కారు దగ్గరికి వెళ్లి డోరు తీయాలని చెప్పారట. 3. అలాగే భానుమతి కిందకు దిగగానే కాళ్లకు నమస్కారం చేయాలని ఎన్టీఆర్ బాలకృష్ణ కు ఈ మూడు కండిషన్స్ పెట్టారట .. తన నాన్న మాట ప్రకారమే బాలయ్య సినిమా పూర్తయ్యే వరకు అలానే చేస్తూ వచ్చారట , ఓ రోజు బానుమతి ఇలా చేయమని మీ నాన్న గారు చెప్పారా, పెద్దలను గౌరవించే లక్షణం నీకు ఉంది పైకి వస్తావ్ అని దీవించారట. దీంతో మంగమ్మగారి మనవడు సినిమా సూపర్ హిట్ అయింది .. బాలకృష్ణ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది ..