సూర్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ కూడా మరింత ఆసక్తి రేకెత్తించాయి. ఇకపోతే గురువారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ:
సినిమా కథ విషయానికొస్తే.. ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో ఓ బౌంటీ హంటర్. పోలీసులు కూడా చేయలేని పనులను చేసి వారి దగ్గర డబ్బు తీసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. అటు ఏంజెలా (దిశా పటాని) ది కూడా ఇదే పని. ఒకప్పుడు వీరిద్దరూ ప్రేమికులే .ఆ తర్వాత విడిపోయి ఎవరి దారి వాళ్లు చూసుకుని ఉంటారు. ఇక ఫ్రాన్సిస్, తన స్నేహితుడు (యోగిబాబు) తో కలిసి ఒక పనిపై ఉన్నప్పుడు జీటా అనే బాలుడిని కలుసుకుంటారు. ఇక అలా కలుసుకున్నప్పుడు వీరిద్దరికీ తెలియని అనుబంధం ఏర్పడుతుంది. తర్వాత ఆ బాలుడి ప్రాణాలకు ప్రమాదం ఉందని ఫ్రాన్సిస్ అర్థం చేసుకుంటాడు. మరి జీటా ను కాపాడేందుకు ఫ్రాన్సిస్ ఎలాంటి సాహసాలు చేశాడు? ఫ్రాన్సిస్, జీటా మధ్య సంబంధం ఏమిటి? అనేది ఈ సినిమా..
ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే.. వెయ్యి సంవత్సరాల కిందటి ఫాంటసీ ప్రపంచాన్ని పక్కాగా ఆవిష్కరించి, అందులోకి తీసుకెళ్లడంలో దర్శకుడు సఫలం అయింది. కానీ కథను చెప్పడంలో శివ తడబాటుపడ్డారు. వర్తమానంతో ముడి పెట్టే క్రమంలో మొదటి 20 నిమిషాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష. కథ పైన పట్టు ప్రదర్శించలేకపోయాడు. ఐదు అంశాలను పరిచయం చేస్తూ గజిబిజి వాతావరణాన్ని సృష్టించారు ముఖ్యంగా ప్రణవ కోన ఎలాంటిదో కేవలం మాటల్లో మాత్రమే చెప్పి వదిలేశారు. ఇక కథ ప్రధానంగా ప్రణవ కోన , కపాల కోన చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ కంగువా కథలను చూసినప్పుడు బాహుబలి తప్పకుండా గుర్తుకొస్తుంది. ఇక ఓవరాల్ గా సూర్య వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. ఇక అభిప్రాయం అనేది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.