జగపతిబాబు హీరోగా నటించిన పెళ్లి పందిరి సినిమాతో పంపిణీదారుడిగా మారి, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2003లో వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన దిల్ సినిమాతో నిర్మాతగా మారి, తన మొదటి సినిమాని ఇంటిపేరుగా పెట్టుకున్నారు. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 సినిమాల వరకు తీసి అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయన బ్యానర్ లో వచ్చిన సినిమాలు 80% సక్సెస్ రేట్ అందుకున్నాయి అంటే ఇక ఈయన జడ్జిమెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే నిర్మాతగానే కాదు ఒక భర్తగా కూడా టెస్టులో పాస్ అయ్యారు. మొదట అనిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు దిల్ రాజు. ఈ దంపతులకు హన్షితా రెడ్డి సంతానం. ఇక 2017లో గుండెపోటుతో ఆమె హఠాన్మరణం చెందారు. భార్య మరణంతో కృంగిపోయిన దిల్ రాజు.. కుమార్తె, ఇతర పెద్దల ఒత్తిడి మేరకు 2020లో తేజస్విని ను వివాహం చేసుకున్నారు. ఈమె రాకతో తన జీవితం మలుపు తిరిగింది.ఒక కొడుకుకు జన్మనిచ్చిన వీరు.. వెకేషన్స్ కి , తీర్థయాత్రలకు వెళ్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు భార్య కెరియర్ పై కూడా దృష్టి పెట్టిన ఈయన.. ఈమె ఉన్నత విద్యకు తోడ్పడ్డారు. ఇటీవలే ఈమె తన భర్త సహకారంతో డిగ్రీని పూర్తి చేశారట. ఇక ఈ విషయం తెలిసి భర్త అంటే ఇలా ఉండాలి.. భార్యకు అన్నివేళలా సహాయంగా ఉండాలి అంటూ దిల్ రాజు పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.