2000ల సంవత్సర ప్రాంతంలో ఆనాటి యువతరానికి ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అప్పటి రోజులలో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్న రమణ గోగుల ఈనాటి తరానికి పెద్దగా గుర్తు ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా పాటలు విన్నప్పుడు ప్రతిసారీ రమణ గోగుల పేరు గుర్తుకు వచ్చి తీరుతుంది. విలక్షణమైన మ్యూజిక్ విభిన్నమైన గొంతుతో ఆనాటి యూత్ ను షేక్ చేసిన రమణ గోగుల చాల కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.



2013లో వచ్చిన తేజ ‘1000 అబద్దాలు’ మూవీ తరువాత రమణ గోగుల మరే సినిమాకు దర్శకత్వం వహించలేదు. ఆయన ఎందుకు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు అన్నది స్పష్టమైన కారాణాలు లేవు. ఆయన ఇండస్ట్రీకి దూరం అయిపోయినప్పటికీ అనేక సినిమాలకు ఆయన కంపోజ్ చేసిన పాటలు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పటికీ ఆపాటలు తరుచూ వినిపిస్తూనే ఉంటాయి.



దాదాపు 22 సంవత్సరాల గ్యాప్ తరువాత తిరిగి రమణ గోగుల పేరు మీడియాలో కనిపిస్తోంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో రమణ గోగుల తో ఒక హుషారైన పాటను పాడించినట్లు వార్తలు వస్తున్నాయి. సంగీత దర్శకుడు భీమ్స్ ట్యూన్ చేసిన ఈ యూత్ ఫుల్ సాంగ్ కోసం పట్టుపట్టి రమణ గోగులతో పాడించడం వెనుక ఒక సెంటిమెంట్ ఉంది అంటున్నారు.



రమణగోగుల సంగీత దర్శకుడుగా 1998లో విడుదలైన వెంకటేష్ ‘ప్రేమంటే ఇదేరాతో’ రమణ గోగుల సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యాడు. అప్పట్లో ఈమూవీలోని పాటలు అన్నీ సూపర్ హిట్ ఆతరువాత పవన్ కళ్యాణ్ కాంబినేషన్ తో వచ్చిన ‘తమ్ముడు’ ‘బద్రీ’ ‘జానీ’ సినిమాలు మూడుటికి సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా ఆమూవీలోని పాటలు సూపర్ హిట్ అవ్వడంతో రమణ గోగుల పేరు మారుమ్రోగిపోయింది. ఆతరువాత అతడు సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు ఫ్లాప్ అవవడంతో తిరిగి వెంకటేష్ సెంటిమెంట్ తో రమణ గోగుల రీ ఎంట్రీ ఇస్తున్నాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: