మహేష్ బాబు.. ఎంత సాఫ్ట్ మైండెడ్ హీరోనో అందరికీ తెలిసిందే . చాలా సెన్సాఫ్ హ్యూమర్ కలిగిన హీరో . తనపై వెటకారంగా ఎవరైనా మాట్లాడితే దానికి అంతే వెటకారంగా కౌంటర్ వేస్తారు.  అలాంటి సందర్భాలు మనం ఎన్నో తెరపై చూసాం . మరీ ముఖ్యంగా మహేష్ బాబుకి లేడీస్ ని ఏమన్నా అంటే మాత్రం చాలా కోపం వస్తుంది . ఎంతలా అంటే అది తన తల్లి ..తన భార్య ..తన చెల్లి ..తన కూతురే కాదు ఏ లేడీస్ నైనా సరే తన ముందు రఫ్ గా మాట్లాడిన ..బూతు పదాలతో వాళ్లను ఎగతాళి చేసిన ..ఇంక ఏ కారణం చేతనైనా ఆడవాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించిన ..మండిపోతూ ఊగిపోతూ ఉంటాడు .


కాగా మహేష్ బాబుకి ఆ కారణంగానే ఇండస్ట్రీలో ఒక హీరో అంటే చాలా చాలా కోపం అన్న ప్రచారం ఇప్పుడు బాగా జరుగుతుంది . మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోలతో  చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు . అయితే పక్కభాష నటూలతో మాత్రం మహేష్ బాబు చాలా ఆచితూచి ప్రవర్తిస్తూ ఉంటారు.  మరి ముఖ్యంగా బాలీవుడ్ హీరో ఒకాయన (నమ్రత ఫ్రెండ్).. మహేష్ బాబు ఇంటికి వచ్చి చాలా వెటకారంగా వ్యంగ్యంగా ఆడవాళ్ళపై పరోక్షంగా బూతు అర్ధం  వచ్చేలా జోకులు వేయడంతో మహేష్ బాబుకు మండిపోయిందట .



అంతేకాదు ఆయన కోపాన్ని చాలా చాలా కంట్రోల్ చేసుకున్నారట.  నమ్రత ఫ్రెండ్ అంటూ స్పెషల్గా రెస్పెక్ట్ ఇవ్వడానికి కూడా చాలా ట్రై చేశారట . ఆయన వ్యంగ్య మాటలు... వెటకారంగా మాట్లాడిన తత్త్వం.. మహేష్ బాబుకు చాలా మండిపోయేలా చేసిందట . ఆ కారణంగానే మహేష్ బాబు ఆ హీరో ని తర్వాత ఇంటికి కూడా పిలవలేదట . నమ్రత కి కూడా ఆయనతో స్నేహం వద్దు అని చెప్పేశారట. ఆయన ఏదైనా ఈవెంట్స్ లో ఆ హీరో మొఖం చూసిన సరే మాట్లాడకుండా వెళ్ళిపోతాడట.  అలాంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ దక్కించుకున్నాడు ఆ బాలీవుడ్ హీరో..!

మరింత సమాచారం తెలుసుకోండి: