అది కూడా పుష్ప సినిమాకి గాను అందుకోవడంతో ఇంకా స్పెషల్ గా మారిపోయింది . అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్న టైం లో అల్లు అర్జున్ కంటే డైరెక్టర్ సుకుమార్ ఎంత ఆనందపడ్డాడో అందరికీ తెలిసిందే. కచ్చితంగా పుష్ప2 సినిమాతో కూడా ఆయనకి నేషనల్ అవార్డ్ వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సుకుమార్ పుష్ప2 సినిమాను డిసెంబర్ ఐదవ తేదీ రిలీజ్ చేయబోతున్నారు . అంటే కరెక్ట్ గా 20 రోజులు ఉందన్నమాట . ఈ 20 రోజుల్లో ఆయన పాన్ ఇండియా లెవల్ లో పుష్ప2 సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించాలి. అయితే ఇప్పటివరకు ప్రమోషన్స్ అనె మాటే లేదు.
అసలకి స్టార్ట్ కూడా చేయలేదు సుకుమార్ . అదేవిధంగా బన్నీ కూడా సైలెంట్ అయిపోయాదు. మరి సినిమాకి ఎలా పబ్లిసిటీ వస్తుంది ..? హైప్ వస్తుంది..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదే మూమెంట్లో "కంగువ" సినిమా ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. కొంగువ సినిమా కోసం సూర్య ఏ రేంజ్ లో కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే . అయితే రిజల్ట్ మాత్రం అందుకు విభిన్నంగా ఉంది . దీంతో సోషల్ మీడియాలో కొన్ని సామెతలను ట్రోల్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు జనాలు . "ఎగిరెగిరి దంచిన అదే పిండి ఎగరకుండా దంచిన అదే పిండి".. మన సినిమాలో కంటెంట్ ఉంటే ప్రమోషన్ నిర్వహించిన అదే కలెక్షన్స్ నిర్వహించకపోయినా అదే కలెక్షన్స్ ..ఇంకెందుకు ప్రమోషన్స్ నిర్వహించడం అంటూ చాలా చాలా బోల్డ్ గా స్పందిస్తున్నారు.