రీసెంట్గా ఆర్తి అగర్వాల్ కిసంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది . ఆర్తి అగర్వాల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందాల కుందనపు బొమ్మ. " నువ్వు నాకు నచ్చావ్" సినిమాలో ఆమె పర్ఫామెన్స్ ఎంతలా అందరినీ ఆకట్టుకుందో చెప్పాలా..? ఇప్పటికి ఆ సినిమా టీవీలో వస్తే వెంకటేష్ కోసం చూసే జనాల కన్నా ఆర్తి అగర్వాల్ కోసం చూసే జనాలు ఎక్కువ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆమె ట్రెడిషనల్ లుక్స్ అదేవిధంగా మోడ్రన్ లుక్స్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యాయి.
కాగా ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీని ఏలేసింది అనే చెప్పాలి . చిరంజీవి లాంటి స్టార్ హీరో కూడా ఆర్తి అగర్వాల్ నటనను ఒక స్టేజిపై ఓపెన్ గానే పొగిడేశారు. అయితే ఏం లాభం ఆమె లైఫ్ లో కొన్ని తప్పుడు డెసిషన్స్ కారణంగా ఆమె లైఫ్ చిందరవందర గా మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఆర్తి అగర్వాల్ హిట్ కొట్టడానికి బాగా ట్రై చేసింది . కానీ హిట్ కొట్టలేకపోయింది . అయితే ఆర్తి అగర్వాల్ తన చివరి కోరిక తీరకుండానే చనిపోయిందట . ఆర్తి అగర్వాల్ కి అమ్మ అని పిలిపించుకోవాలని చాలా చాలా ఆశగా ఉండిందట . పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ కోసం చాలా ట్రై చేసిందట . కానీ ఆమె ఆ కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది అని తెలుసుకొని జనాలు ..ఆమె ఫ్యాన్స్ ..బాగా ఫీల్ అయిపోతూ బాధపడిపోతున్నారు..!