- సాహో,రాధే శ్యామ్,ఆదిపురుష్ తో హ్యాట్రిక్ డిజాస్టర్స్..
- ప్రభాస్ లుక్ పై భారీ ట్రోల్స్..
- మీసాల రాముడు అంటూ ఆది పురుష్ మూవీ పై ట్రోల్స్..


 ప్రభాస్..ఈ పేరు చెబితేనే ఎంతోమంది సినీ అభిమానుల రూమాలు నిక్కబడుచుకుంటాయి. అలా తన సినిమాలతో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎంత చిన్న హీరోనో చెప్పనక్కర్లేదు. ఈయన పెదనాన్న పెద్ద హీరో అయినప్పటికీ ప్రభాస్ ని చూసిన చాలామంది అసలు వీడేం హీరో అవుతాడు అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ చాలా మొహమాటంగా ఉంటారు. ఏదైనా విషయాన్ని అందరి ముందు మాట్లాడాలంటే సిగ్గుపడతాడు. అలాంటి ఈయన హీరో ఎలా అవుతాడు హీరో అవ్వాలంటే ఎవరి ముందు మొహమాట పడకుండా డైలాగులు చెప్పాలి. రొమాన్స్ చేయాలి..కానీ ప్రభాస్ కి మాత్రం మొహమాటం ఎక్కువ.కానీ అలాంటి ప్రభాస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న హీరో.అయితే అలాంటి ఈ హీరో పై కొన్ని సినిమాల్లో ట్రోల్స్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. మరి ఆ ట్రోల్స్ కి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

 ప్రభాస్ పై ట్రోల్స్:

 రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనే విధంగా ఆయన క్రేజ్ మారిపోయింది.ప్రభాస్ బాహుబలి ముందు చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే బాహుబలి ఒకెత్తు అనే విధంగా మారిపోయింది. ఇక బాహుబలి తర్వాత ఈయన చేసిన సాహో, రాధే శ్యామ్,ఆది పురుష్ వంటి మూడు సినిమాలు వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ప్రభాస్ క్రేజ్ తగ్గిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ సలార్,కల్కి మూవీ లతో మళ్లీ తన సత్తా చాటారు. అయితే ప్రభాస్ కి హ్యాట్రిక్ డిజాస్టర్స్ రావడానికి కారణం సాహో, రాధే శ్యామ్ వంటి సినిమాల్లో ఆయన లుక్స్ పై తీవ్రంగా విమర్శలు రావడమే. ముఖ్యంగా సాహో,రాధే శ్యామ్ వంటి సినిమాల్లో అక్కడక్కడ ప్రభాస్ లుక్స్ ని చూసిన చాలామంది తీవ్రంగా ట్రోల్స్ చేశారు.కొన్ని కొన్ని ఫ్రేమ్స్ లో ప్రభాస్ లుక్ చూసి ప్రభాస్ అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.


ముఖ్యంగా ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆది పురుష్ సినిమా సమయంలో మాత్రం తీవ్ర దుమారం రేగింది.ప్రభాస్ ఈ సినిమాలో మీసాలు పెట్టుకునే నటించారు. అయితే రాముడికి మీసాలు ఉండవు. మీసాల రాముడు ఎక్కడినుండి వచ్చాడు అంటూ ఎంతోమంది ఈయనపై విమర్శలు చేశారు.ముఖ్యంగా ప్రభాస్ చేసిన ఆది పురుష్ సినిమాలో ఓ సన్నివేశంలో ఆయన లాంగ్ హెయిర్ తో కనిపిస్తారు.. ఇక ఈ సన్నివేశం అయితే ప్రభాస్ పై మరిన్ని ట్రోల్స్ పెంచింది.. దాంతో ఈ మూడు సినిమాలు అట్టర్ ప్లాఫ్ అయ్యాయి. ముఖ్యంగా ఈ హ్యాట్రిక్ డిజాస్టర్స్ రావడానికి కారణం కూడా  ఈ సినిమాల్లో ప్రభాస్ లుక్స్ బాగా లేకపోవడమే అని ఎంతో మంది కామెంట్స్ చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన సలార్, కల్కి వంటి సినిమాల్లో ప్రభాస్ ని తన అభిమానులు ఏ రేంజ్ లో చూడాలి అనుకుంటున్నారో ఆ రేంజ్ లో ప్రశాంత్ నీల్  నాగ్ అశ్విన్ లు చూపించారు

మరింత సమాచారం తెలుసుకోండి: