అయితే గతంలో పలు సందర్భాల్లో బాలయ్య లుక్స్ విషయంలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రెండు సినిమాల విషయంలో ఈ విధంగా జరిగింది. ఈ సినిమాలలో ఒకటి వీరభద్ర కాగా రెండో సినిమా రూలర్ కావడం గమనార్హం. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. బాలయ్య లుక్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన రెండు సినిమాలు ఈ సినిమాలే కావడం గమనార్హం.
వీరభద్ర సినిమాలో బాలయ్య రింగు రింగుల జుట్టులో కనిపించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. రూలర్ సినిమాలో పోలీస్ గెటప్ లో బాలయ్య కనిపించింది కొన్ని నిమిషాలే అయినా బాలయ్య మాత్రం అదరగొట్టారనే చెప్పాలి. బాలయ్య డాకు మహారాజ్ సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. సంక్రాంతి రేసులో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అన్ని లక్షణాలు ఈ సినిమాకు ఉన్నాయి.
బాలయ్య సినీ కెరీర్ లో పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. బాలయ్య సినిమా సినిమాకు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య కెరీర్ పరంగా మరింత ఎదగాలని మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు.