అక్కినేని నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మన్మధుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక నాగార్జున డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన చిత్రం "సూపర్". ఈ సినిమా 2005లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు సోనుసూద్ మరొక కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు.


ఈ సినిమాతోనే అనుష్క శెట్టి టాలీవుడ్ సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది. సూపర్ సినిమాతోనే బాలీవుడ్ అందాల తార అయేషా టకియా కూడా మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో తన అందం, నటనతో అబ్బాయిల హృదయాలను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో "గుచ్చి గుచ్చి చంపమాకు ఓయ్ లా"పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.


అయేషా నటించిన ఏకైక తెలుగు సినిమా సూపర్ కావడం గమనార్హం. అటు అనుష్క ఇందులో సెకండ్ హీరోయిన్ గా చేసి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతోనే తన సినీ కెరీర్ ప్రారంభించిన అనుష్కసినిమా అనంతరం వరుసగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఆకట్టుకున్న ఈ చిన్నది తన నటన, అందంతో దర్శక నిర్మాతలను సైతం ఫిదా చేసింది.


ఇక ఈ సినిమాలో నాగార్జున లాంగ్ హెయిర్ లో కనిపించి అమ్మాయిల మనసులను ఆకట్టుకున్నాడు దోచుకున్నాడు. నాగార్జున హెయిర్ స్టైల్ ని చాలామంది ఫాలో అయ్యారు. ఇక మరికొందరేమో ఈ సినిమాలో నాగార్జున హెయిర్ స్టైల్ అస్సలు బాగాలేదని విమర్శలు చేశారు. లాంగ్ హెయిర్ కాకుండా షార్ట్ హెయిర్ ఉంటే చాలా బాగుండేది అంటూ కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేశారు. ఇక ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని నాగార్జున కెరీర్ లో సక్సెస్ఫుల్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: