ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ ఆనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస పెట్టి సినిమాల్లో నటించి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు. అందులో కొన్ని ఫ్లాప్స్ కాగా మరికొన్ని సూపర్ హిట్ అందుకున్నాయి. ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలోనైనా చాలా అద్భుతంగా నటిస్తాడు.


సింగిల్ టేక్ లో ఎంతటి కష్టమైనా సీన్ నైనా చేయగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ చాలావరకు తన సినిమాలలో తండ్రి కొడుకుల పాత్రలో నటిస్తూ ఉంటారు. ఇది అతడికి కొత్త ఏమీ కాదు. ముఖ్యంగా ఆంధ్రావాలా, శక్తి సినిమాలలో ఎన్టీఆర్ తండ్రి కొడుకుల రోల్స్ లో నటించాడు. అయితే ఆ రెండు సినిమాలు తారక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలుగా నిలిచాయి. ఆ సినిమా పేర్లను తలుచుకోవడానికి కూడా ఎన్టీఆర్ అభిమానులు అస్సలు ఇష్టపడరు.


జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రవాలా సినిమా 2004లో విడుదలైంది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తారక్ కు జోడిగా రక్షిత హీరోయిన్గా చేసింది. ఈ సినిమాలో తారక్ తండ్రి పాత్రలో చేసిన క్యారెక్టర్ అస్సలు బాగాలేదు. ప్రేక్షకుల నుంచి చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ శక్తి సినిమాలో కూడా ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో ఎన్టీఆర్ తండ్రి పాత్ర అస్సలు బాగాలేదు.


ఈ  సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2011లో విడుదలైంది. ఇందులో ఇలియానా హీరోయిన్గా చేసింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఇందులో ఎన్టీఆర్ తండ్రి పాత్ర అస్సలు బాగాలేదని చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: