టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన పలకనామ దాస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో విశ్వక్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

కానీ ఈ సినిమాతో విశ్వక్ కి నటుడుగా మాత్రమే కాకుండా దర్శకుదిగౌ కూడా మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఈయన మెకానిక్ రాఖీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మరి కొంత కాలం లోనే విడుదల కానుంది. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి శ్రద్ధా శ్రీనాథ్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే తాజాగా విశ్వక్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా తనకు గతంలో శ్రద్ధ శ్రీనాథ్ వల్ల ఎదురైన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... నేను కొన్ని సంవత్సరాల క్రితం పలకనామా దాస్ అనే సినిమాలో నేను నటించాను , అలాగే ఆ మూవీ కి దర్శకత్వం కూడా వహించాను.

ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నేను మొదటగా శ్రద్ధ శ్రీనాథ్ ను తీసుకోవాలి అనుకున్నాను. ఇక ఆమె ముంబైలో ఉంది అంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ముంబైకి వెళ్లి మరి ఆమెకు స్టోరీని వినిపించాను. ఆమె స్టోరీ మొత్తం విని సినిమా చెయ్యను అని చెప్పింది. ఇక ఆ సమయంలో ఆమె వల్ల నేను చాలా మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాను. కానీ అదంతా వేస్ట్ అయిపోయింది. ఇక ప్రస్తుతం ఆమె నా సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది అని విశ్వక్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: