ఎవరో ఇద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో ఒకరు బలి అయిపోతూ ఉంటారు అన్న సామెత మనకు తెలిసిందే. అలా వాళ్ళు వీళ్ళు గొడవపడి మధ్యలో ఒకరికే అన్యాయం చేస్తూ ఉంటారు. ప్రజగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా కంగువాకు అన్యాయం జరిగింది. ఒకప్పుడు సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ ఉండేది అది మధ్యలో పోయింది. ఇప్పుడు కంగువా సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ విజయం సాధించాలని కలలుగన్న సూర్య ఆశలకు ఆదిలోనే బ్రేక్ పడిపోయింది. టాలీవుడ్ లో మరీ ముఖ్యంగా నైజాంలో రెండు పెద్ద పంపిణీ సంవత్సల‌ మధ్య ఉన్న గొడవ కారణంగా సూర్య సినిమాకు నైజం లో మరి ముఖ్యంగా హైదరాబాదులో కీల‌కమైన ఏరియాలలో మేజర్ థియేటర్లు లేకుండానే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.


ఏది ఏమైనా కారణాలు ఏదైనా కావచ్చు .. రెండు పెద్ద పంపిణీ ప్లేయర్స్ మధ్య గొడవలు సూర్య సినిమాకు భారీ నష్టం వాటిల్లింది.. అలాగే కంగువా సినిమా వ‌ల్ల‌ నైజాంలో రెండు పెద్ద పంపిణీ సంస్థల మధ్య అంతర్గతంగా ఉన్న గొడవ కాస్త మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. ఇది భవిష్యత్తులో మరింత పెద్ద యుద్ధానికి కారణం అవుతుందన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఏషియన్ గ్రూపుకు నైజంలో భారీ సంఖ్యలో థియేటర్లో స్క్రీన్ లో ఉన్నాయి. వాటిలో కనీసం 30% కూడా కంగువా సినిమాకు దక్కలేదు. హైదరాబాదులో కీలకమైన ఏఎంబి - ఏఏఏ స్క్రీన్లు కూడా ఆఖరి నిమిషంలో అందుబాటులోకి వచ్చాయి.


ఇవి కూడా దక్కకపోతే హైదరాబాదులో కంగువా పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. అది కూడా చాలా లిమిటెడ్ షోలు మాత్రమే ఇచ్చారు. అటు పివిఆర్ పరిస్థితి కూడా అంతే .. హైదరాబాదులో కేవలం ఒకే ఒక్క పీవీఆర్‌ స్క్రీన్ మాత్రమే కంగువా వరకు దక్కింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మేజర్ సెంటర్స్ లో ఒక్కటంటే ఒక్క పివిఆర్ స్క్రీన్ కూడా సూర్య సినిమాకు ఇవ్వలేదు. తాజా వివాదం సూర్య సినిమా ఓపెనింగ్ ప్రభావం చూపించిందని అంటున్నారు. అయితే ఇది ఇక్కడతో సద్దమణిగితే పరిస్థితి లేదు. భవిష్యత్తులో పంపిణీ సంస్థల మధ్య యుద్ధంతో పెద్ద సినిమాలకు మరింత ఇబ్బంది కలగటం లేదా మంచిది థియేటర్లకు మంచి సినిమాలు రాకపోవడం జరగటం కాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: