టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను ఏర్పరచుకున్న వారిలో అల్లు అర్జున్ ఒకరు. ఈయన ఆఖరుగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ చిత్రీకరణ జరుగుతుంది.

ఇకపోతే పుష్ప పార్ట్ 1 మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇక ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అలాగే ఈ మూవీ కి సంబంధించిన టోటల్ పనులు నవంబర్ నెలలో పూర్తి అవుతాయి అని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే నవంబర్ నెలలో సగం గడిచిపోయింది. ఇంకా ఈ మూవీ కి సంబంధించిన బిజిఎం వర్క్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో వైపు ప్యాచ్ వర్క్ , డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఇక మరో వైపు ఈ సినిమాకు సంబంధించిన ఇంకో డ్యూయెట్ సాంగ్ షూటింగ్ కూడా పెండింగ్లో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ మూవీ విడుదల తేదీ అత్యంత దగ్గరకు వచ్చిన ఈ సినిమా పనులు చాలా పెండింగ్ ఉండడంతో బన్నీ ఫాన్స్ ఫుల్ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ యొక్క టీజర్ను నవంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ టీజర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa