అయితే హీరోయిన్ గా మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే సంగీత పెళ్లి చేసుకుంది. 2009 లో తమిళ గాయకుడు క్రిష్ ను సంగీత పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉంటూ సినిమాలుకు గ్యాప్ ఇచ్చిన ఈ సీనియర్ నటి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. మహేష్ హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్ రష్మిక కు తల్లి పాత్రలో నటించి నవ్వులు పూయించింది. అలాగే చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఓ పాటలో కూడా తలుక్కున మెరిసింది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వచ్చిన వారసుడు సినిమాలో కూడా కీలకపాత్రలో నటించింది.
ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా ఉంది. అలాగే బుల్లితెరపై కూడా ఈ సీనియర్ నటి సందడి చేస్తుంది. అయితే సంగీత ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికి తెలియదు .. సంగీత, క్రిష్ దంపతులకు శివ్హియ అనే కూతురు ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంగీత అప్పుడప్పుడు తన భర్త, కూతురితో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఇక పండగల సమయంలోనూ కూతురితో తీసుకున్న ఫొటోలను సంగీత పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోల్లో సంగీత కూతుర్ని చూసిన నెటిజన్లు ఈమెకు ఇంత పెద్ద కూతురు ఉందా.. అంటూ షాక్ అవుతున్నారు.. సంగీత కూడా తన కూతుర్ను రాబోయే రోజుల్లో హీరోయిన్గా పరిచయం చేస్తుందో లేదో చూడాలి.