మెగా ఫ్యామిలీ లాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉపయోగపడలేదు! అల్లు అర్జున్‌కు స్ట్రాంగ్ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. తండ్రి అల్లు అరవింద్ పెద్ద నిర్మాత, తాత అల్లు రామలింగయ్య అలనాటి హాస్య నటుల్లో ఒకరు. మెగాస్టార్ చిరంజీవి బన్నీకి మేనమామ. ఇంత భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభంలో ఒడిదుడుకులు ఎదుర్నొన్నాడు. తన మొదటి సినిమా ‘గంగోత్రి హిట్ అయినప్పటికీ, బన్నీకి అంతగా గుర్తింపు రాలేదు. ఆ సినిమాలో లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ కొందరికి నచ్చలేదు. అందుకే మంచి సినిమా అవకాశాలు రాలేదు. గంగోత్రి బ్లాక్‌బస్టర్ అయినా, ఆర్టిస్ట్‌గా బన్నీ ఫెయిల్ కావడంతో గుర్తింపు రాలేదు. కానీ భవిష్యత్తులో ఇతను పాన్ ఇండియా స్టార్ అవుతాడు అని ఎవ్వరూ ఊహించలేదు.
గంగోత్రి సినిమా తర్వాత అల్లు అర్జున్ సంవత్సరానికి పైగా గ్యాప్ తీసుకుని తన్ని తాను మార్చుకుని ఆర్య సినిమాతో తానేంటో టాలీవుడ్కు చూపించాడు. ఆ సినిమాల్లో తన నటన డాన్స్ తో అందరి నోరులు మూయించాడు.. అలా టాలీవుడ్ లోనే స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయ అందుకుని ఐ కాన్ స్టార్ గా మారాడు.. అలాగే పుష్ప సినిమాతో జాతియ అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో 1000కోట్ల హీరోగాా మారిపోతున్నాడు.. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.