సినిమా ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న సినిమాను మరొకరితో చేయడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా చేయడానికి ప్రధాన కారణం ... ఒక దర్శకుడు ఒక కథను ఒక హీరోతో చేయాలి అనుకొని అతనికి కథను వివరించిన సమయంలో అతనికి ఆ కథ నచ్చకనో లేక ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్లనో , మరి కొన్ని కారణాల వల్లనో సినిమాను రిజెక్ట్ చేసిన సందర్భాలలో అదే కథతో వేరే వారితో తీసి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సినిమాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే ఇలా సుమంత్ కెరియర్ లో కూడా జరిగినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరోగా హన్సిక హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దేశముదురు అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కు సూపర్ క్రేజ్ వచ్చింది. ఇకపోతే మొదట పూరీ జగన్నాథ్ ఈ సినిమాను అల్లు అర్జున్ తో కాకుండా ఆ సమయంలో మంచి జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న సుమంత్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనను కలిసి కథ మొత్తాన్ని కూడా వివరించాడట.

కథ మొత్తం విన్న తర్వాత ఆయనకు స్టోరీ పెద్దగా నచ్చకపోవడంతో సినిమా చేయను అని చెప్పాడట. దానితో పూరి జగన్నాథ్ ఇదే కథను అల్లు అర్జున్ కు వినిపించగా ఆయనకు ఈ స్టోరీ సూపర్ గా నచ్చడంతో వెంటనే సినిమా చేస్తాను అని అన్నాడట. దానితో దేశముదురు అనే టైటిల్ తో ఈ మూవీ ని పూరి జగన్నాథ్ రూపొందించాడట. ఇక ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. అలా సుమంత్ ఓ భారీ బ్లాక్ బస్టర్ మూవీ ని మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: