ప్రస్తుతం వస్తున్న సినిమాలలో ట్రెండ్ ఏమిటంటే లిప్ లాక్ కిస్.. పెద్ద ముద్దు సీన్లు చాలా కామన్ అయిపోయింది ఇలాంటి సీన్లు హీరో హీరోయిన్లు ఎంతో హుషారుగా చేసేస్తున్నారు. అలాగే ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో ఉంటే కలెక్షన్లు బాగా వస్తాయని నిర్మాతలు ఖచ్చితంగా లిప్ లాక్ సన్నివేశాలు ఉండేలా చూసుకుంటున్నారు. అయితే అందరూ హీరోలు అందుకు ఇష్టపడరు అలాంటి వారిలో రామ్ చరణ్ కూడా ఒకరు. ట్రెండ్ ఏదైనా కానీ లిప్ లాక్ సీన్ లకు నేను ఆమడ దూరం అంటున్నాడు రామ్ చరణ్. ఈ డిసిషన్ ఆయన ఎప్పుడు తీసుకున్నాడు అంటే..
ఉపాసనతో తన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రామ్ చరణ్ ఆమెను బాధ పెట్టే విధంగా 'నడుచుకోకూడదని నిర్ణయించుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.. ఆ విషయం డైరెక్ట్ గా చెప్పలేక తెరపై హీరోయిన్లతో ముద్దు సీన్లు చేయడానికి నిరాకరిస్తున్నాడని పరిశ్రమ వర్గాలు అంటున్నయి. ఇప్పుడు పెళ్లై ఇంతకాలం అయ్యింది కాబట్టి ఇప్పుడు అసలు వాటి జోలికే పోవటం లేదు రామ్ చరణ్. కానీ రంగస్దలం సినిమాలో సమంతతో లిప్ లాక్ లాంటి సీన్ చేయకతప్పలేదు. డైరక్టర్ సుకుమార్ ..ఆ సీన్ సినిమాలో తప్పనిసరి అని చెప్పి ఒప్పించారట. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమలోనూ అలాంటి సన్నివేసం ఉంటే సున్నితంగా నో చెప్పారట.