చాలా మంది హీరోలు , హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు .. తమతో కలిసి నటించిన హీరోయిన్ ని ఏరుకోరి పెళ్లి చేసుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలా హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న హీరోలు ఎవరో ఇక్కడ చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే కృష్ణ ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మ‌న‌సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు .. ఈయన కూడా నటి విజయనిర్మలతో కలిసి ఎన్నో సినిమాలు నటించారు తర్వాత ప్రేమలో పడి ఆమెని పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్న కృష్ణ , విజయనిర్మలని రెండో పెళ్లి చేసుకున్నాడు.


మరో స్టార్ హీరో అక్కినేని నాగార్జున సైతం తనతో కలిసి సినిమాల్లో నటించిన ఆమలని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. ఆమ‌ల‌న్ని ప్రేమించి నాగార్జున పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి అఖిల్ కూడా పుట్టాడు.. అప్పటికే రామానాయుడు పెద్ద కూతురు దగ్గుపాటి లక్ష్మితో నాగార్జునకు పెళ్లిపోయింది నాగచైతన్య కూడా పుట్టాక వారి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరో స్టార్ హీరోయిన్ నమ్రత తో కలిసి వంశీ సినిమాలో నటించారు. వీళ్ళు కూడా ఆ సినిమా తర్వాత కొన్ని సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నారు.ఊహ - శ్రీకాంత్ కూడా కలిసి సినిమాల్లో న‌టించిరు. ఊహ ప్రేమలో పడిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు .


అలానే పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ తో సహజీవనం చేసి తర్వాత పెళ్లి చేసుకున్నారు. త‌ర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో వరుణ్ సందేశ్ వితిక నటించి తర్వాత నిజంగానే ప్రేమలో పడిపోయి పెళ్లి చేసుకున్నారు.. రాజశేఖర్ జీవిత కూడా కలిసి సినిమాలో నటించారు. వీళ్ళు కూడా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. నాగచైతన్య - సమంత కూడా ఏ మాయ చేసావే సినిమాలో కలిసి నటించారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అలానే ప్రస్తుతం నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత దూళిపాళ‌తో ప్రేమలో పడి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు.. ఇక వేరే కాకుండా కిరణ్ అబ్బవరం , నారా రోహిత్.. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా మన భారతీయ చిత్ర పరిశ్రమలో కూడా ఎందరో హీరోలు తమతో కలిసి నటించిన హీరోలను అలాగే తమ సినిమాలకు దర్శకులుగా ఉన్న డైరెక్టర్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎందరో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: