మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు అపోలో హాస్పిటల్స్ చైర్మన్మెగా వేలకోట్ల ఆస్తికి అధిపతి అయిన ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని పెళ్లి చేసుకుని 13 సంవత్సరాల నుంచి అతనితో కలిసి నడుస్తుంది. గత సంవత్సరమే ఈ జంటకు క్లింకర అనే పాప కూడా జన్మించింది.. పెళ్లయిన చాలా సంవత్సరాలకు మెగా కుటుంబంలో ఈ వారసురాలు వచ్చింది. రామ్ చరణ్ కూడా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా వరుస‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛెంజ‌ర్‌ సినిమాతో ఈ సంక్రాంతి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. అలాగే ఉప్పెన‌ దర్శకుడు బుచ్చిబాబుతో ఓ భారీ పాన్ ఇండియా సినిమా కూడా చేయబోతున్నాడు.


సినిమా తర్వాత మరోసారి స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో తన తర్వాత సినిమా చేయబోతున్నాడని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసనకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఉపాసన - రామ్ చరణ్ ని పెళ్లి చేసుకోక ముందు సినిమాల్లోకి రావాలని అనుకున్నారు రామ్ చరణ్ మొదటి చిత్రం చిరుతలో ఉపాసన హీరోయిన్ గా నటించాలని అనుకున్నారు కానీ సినీ ఇండస్ట్రీ మనకి కలిసి రాదని వైద్య రంగంలో ఉన్నత శిఖరాలని చేరుకోగలమని ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్ బాధ్యతలు అప్పగించారు.


ఆలా హీరోయిన్ అవ్వాల్సిన ఉపాసన అపోలో హాస్పిటల్స్ కి చైర్మన్ అయ్యారు .. ఎన్నో వేల మంది పేదలకు తన వంతు సహాయాన్ని ఉపాసన అందిస్తున్నారు ఉచిత వైద్యం కూడా చాలా మందికి అందించారు. సోషల్ మీడియాలో ఆమె పలు టిప్స్ ని కూడా ఇస్తూ ఉంటారు ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా ఉపసనా నిర్వహిస్తూ ఉంటారు. రామ్ చరణ్ అభిమానులు అందరూ కూడా ఉపాసనను కూడా ఇష్టపడుతుంటారు ఆమె చేసే సేవా కార్యక్రమాలను షేర్ చేస్తూ ఉంటారు .

మరింత సమాచారం తెలుసుకోండి: