టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి పండగ వచ్చింది అంటే చాలు అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఎక్కువ శాతం స్టార్ హీరోలు తమ సినిమాలను సంక్రాంతి పండక్కి రిలీజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దానితో ఆ పండక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన జోష్ ఉంటుంది. ఇకపోతే 2019 వ సంవత్సరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన వినయ విధేయ రామ , నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన కథనాయకుడు , విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఎఫ్ 2 సినిమాలు విడుదల అయ్యాయి.

ఇందులో విధేయ రామ , కథానాయకుడు సినిమాలో భారీ అపజయాలను అందుకోగా , ఎఫ్ 2 మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ , బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న డాకు మహారాజ్ , విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి. దానితో 2019 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ దగ్గర తలపడిన చరణ్ , బాలయ్య , వెంకీ మరోసారి 2025 సంక్రాంతి కి తలబడబోతున్నారు. మరి అప్పటి సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ సారి కూడా వెంకీ విజయం సాధిస్తాడు అని వెంకటేష్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇకపోతే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే 2019 సెంటిమెంట్ తారుమారు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

ఇప్పటికే గేమ్ చేంజర్ , డాకు మహారాజ్ సినిమా టీజర్లు విడుదల కాగా అవి అద్భుతమైన స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి అని ప్రేక్షకులు భావిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీజర్ కూడా వచ్చి ఆ సినిమా టీజర్ కూడా బాగున్నట్లయితే దానిపై కూడా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. మరి వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: