ఎస్ ప్రజెంట్ ఇదే వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే..త్వరలోనే అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు . ఆయన మొదటగా హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. ఈ మధ్య గ్యాప్ లోనే హీరోయిన్ శోభిత ధూళీపాళ్లతో బాగా రాసుకుని పూసుకుని తిరగడం ..వాళ్లకు సంబంధించిన పలు  పిక్చర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ గా మారడం చక చక జరిగిపోయాయి .


పలు సందర్భాలలో వీళ్ళను ఆ విషయం గురించి ప్రశ్నించిన మా మధ్య ఏమీ లేదు ..వీ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ తప్పుకున్నారు. అసలు నాగచైతన్య అయితే ఆన్సర్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు .కాగ  సడన్ గా నిశ్చితార్ధం  చేసుకొని ఆ ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అభిమానులకి బిగ్ షాక్ ఇచ్చారు.  నిజానికి వీళ్ళ పెళ్ళి  డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరగాలి అంటూ ఇరు కుటుంబ సభ్యులు నిశ్చయించారట .



దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు అంటూ వార్తలు వినిపించాయి. కాగా ఇప్పుడు ఆ పెళ్లి డేట్ ను పోస్ట్ పోన్ చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది . అక్కినేని నాగచైతన్య -శోభిత  ధూళిపాళ్ల  పెళ్లి డిసెంబర్ 4వ తేదీ జరగడం లేదట . వేరే ముహూర్తం ఫిక్స్ చేసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట కుటుంబ సభ్యులు . దానికి కారణం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్  బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి న్యూస్ ఇంటర్నెట్ ని షేక్ చేసేస్తుంది. చూడాలి దీని పై నాగార్జున లేదా నాగ చైతన్య ఎలా స్పందిస్తారో..??

మరింత సమాచారం తెలుసుకోండి: