అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విలన్ పహాధ్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... అనసూయ , సునీల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా యొక్క మొదటి భాగం సూపర్ సక్సెస్ కావడంతో రెండవ భాగంపై దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని కొంత కాలం క్రితం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఆ తర్వాత ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మరో ప్రకటనను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. కొంత కాలం క్రితం ఈ సినిమాని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మరో ప్రకటనను ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ మూవీవ్పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి మొత్తంగా 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన యుఎస్ఏ బుకింగ్స్ ఓపెన్ కాగా అక్కడ రికార్డు స్థాయిలో ఈ మూవీ కి టికెట్స్ సేల్ అవుతున్నాయి.

అలాగే బుక్ మై షో లో కూడా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. అలా ఎక్కడ పడితే అక్కడ ఈ సినిమా అదిరిపోయే రేంజ్ రికార్డులను సృష్టిస్తుంది. దానితో బన్నీ అభిమానులు ఓ వైపు ఆనందంగా ఉన్న మరో వైపు అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు ప్రమోషన్స్ ను మొదలు పెడతారు. అసలు ఈ సినిమా విడుదల అవుతుందా లేక పోస్ట్ పోన్ అవుతుందా అనే అయోమయంలో వారు తెగ కంగారు పడుతున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: