చిరంజీవి హీరో గా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా  చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర టీమ్  అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. చిరు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.ఇందులో ఆయన త్రిశూలం చేత పట్టుకుని కన్పించారు. చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు, ఒక అద్భుతమైన తార పోరాడటానికి ప్రకాశిస్తుందిఅని చిత్ర ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది.  ఈ సినిమాకు ఇప్పటికే ఓ రేంజిలో క్రేజ్ ఉంది.  అంతవరకూ బాగానే ఉంది. అయితే ఈ సినిమా ఇంపాక్ట్ వెళ్లి అఖిల్ కొత్త సినిమాపై పడుతోందిట. అదెలా అనేది చూద్దాం. గత కొంతకాలంగా యువి క్రియేషన్స్ వరుస ఫ్లాప్లను అందిస్తూ వస్తోంది.  దాంతో ఆ సంస్ద  చాలా ఆర్థిక ఒత్తిడిలో ఉంది. దాంతో ఈ సారి వారు ఆచి,తూచి అడుగులు వేయాలని మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన విశ్వంభర మీదే పూర్తి దృష్టి పెట్టారు. సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా టైమ్ తీసుకుని సినిమా సెట్ చేసారు.  

వసిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఇప్పటివరకూ చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘విశ్వంభర’ తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలిచిపోనుంది. అంతేకాదు, సోషియో ఫాంటసీ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం.ఈ చిత్రం 2025 సంక్రాంతి రేసులో ఉంది, కానీ రకరకాల లెక్కల కారణంగా వేసవికి వాయిదా పడింది. మేకర్స్ ఈ సినిమాపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు.

అలాగే వారి పెద్ద పెట్టుబడులను తిరిగి పొందడానికి రిలీజ్  కోసం ఎదురుచూస్తున్నారు.  ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ డీల్స్ కూడా ఇంకా పూర్తి కాలేదు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండటంతో ఫైనాన్సియల్ ప్రెజర్ చాలా ఉంది. ఇదిలా ఉంటే ఇదే బ్యానర్ లో అక్కినేని అఖిల్ హీరోగా ఓ సినిమా ఓకే చేసారు.  100 కోట్ల బడ్జెట్ తో  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్  ఓ యోధుడిగా నటిస్తున్నారు. కానీ నిర్మాతలు విశ్వంభర చిత్రం కోసం  కేవలం డబ్బు మాత్రమే కాకుండా తాము కూడా   బ్లాక్ అయ్యిపోయారు. పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టి పెట్టారు. ఇదొక ప్రెస్టేజియస్ సినిమాగా చేస్తున్నారు.  దాంతో  వారు  అఖిల్  చిత్రాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: