- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా న‌టించిన భారీ పాన్ ఇండియా సినిమా కంగువా. సూర్య సోలో గా న‌టించిన సినిమా వ‌చ్చి మూడేళ్లు దాటుతోంది. శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ భారీ బ‌డ్జెట్ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జ‌స్ట్ ఓకే టాక్ తెచ్చుకుంది. త‌మిళ బాహుబ‌లి అంటూ ప్ర‌చారం జ‌రిగినా క‌థ‌లో అంత బ‌లం లేక‌పోవ‌డం.. కేవ‌లం సూర్య కోస‌మే ఈ సినిమా చూడాల‌న్న టాక్ రావ‌డంతో సినిమా పై ఉన్న భారీ అంచనాలు అయితే అందుకునేంత సీన్ సినిమాకు క‌న‌ప‌డ‌డం లేదు.


ఇక సూర్యసినిమా లో న‌టించి నందుకు గాను ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడు ? అన్న‌ది కాస్త ఆస‌క్తి క‌ర‌మే. మామూలుగా సూర్య ఒక్కో సినిమా కు రు. 50 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు .. అయితే కంగువా కోసం కేవ‌లం రు. 39 కోట్లు మాత్ర‌మే రెమ్యున‌రేష‌న్ గా తీసుకున్న‌ట్టు టాక్ ?  సినిమా లో గ్రాఫిక్స్ కు భారీగా ఖ‌ర్చు పెట్టారు. అదీ కాకుండా క‌ల్కి సినిమా కు గాను కేవ‌లం రు. 1.5 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న దిశా ప‌టానీకి ఈ సినిమాలో చేసినందుకు గాను ఏకంగా రు. 3 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చారు.


అలాగే ఈ సినిమాలో విల‌న్ గా న‌టించిన బాలీవుడ్ న‌టుడు బాబీ డివోల్ కూడా మంచి గా రు. 5 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడు. కంగువా బ‌డ్జెట్‌లో వీరి ముగ్గురి రెమ్యున‌రేష‌న్లు ఏకంగా 16 శాతం ఉన్నాయి. ఇదంతా సూర్య త‌న రెమ్యున‌రేష‌న్ త‌గ్గించు కోవ‌డం వ‌ల్లే సాధ్య‌మైంది. ఇక సూర్య గ‌త చివ‌రి మూడు సినిమాలు అంచ‌నాలు అందుకోలేదు. మ‌నోడి మార్కెట్ కూడా త‌గ్గిపోయింది. అందుకే గ‌త ఐదేళ్ల‌లో సూర్య రెమ్యున‌రేష‌న్ ఏకంగా 16 శాతం వ‌ర‌కు కోత ప‌డింద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: