నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటిస్తోన్న సినిమా టైటిల్ ఈ రోజు రివీల్ అయ్యింది. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా వస్తోన్న ఈ సినిమా టైటిల్ ముందు నుంచి అనుకున్నట్టు గానే డాకూ మహారాజ్ అని ఫిక్స్ చేశారు. ఈ సినిమా విభిన్న మైన కాలాలకు సంబంధించింది అని అంటున్నారు. బాలయ్య మూడు పాత్రల్లో కనిపిస్తారని .. మూడు పాత్రల పక్కన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. మొత్తం 96 సెకన్ల పాటు ఉన్న టీజర్ ఆద్యంతం అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పవర్ ఫుల్ డైలాగులతో నిండి పోయింది.
అసలు బాలయ్య పాత్ర ఎలా ఉండబోతోందో భయంకరమై డైలా గులతో ఎలివేషన్ ఇచ్చారు. ఈ ఎలివేషన్ చూస్తుంటేనే ఖచ్చితంగా కథ.. బాలయ్య పాత్ర కొత్తగా ఉండబోతోందంటున్నారు. ఒక్కసారి ఆ డైలాగ్ చూస్తే ఎలా ఉందో తెలుస్తోంది.
ఈ కథ వెలుగులు పంచే దేవుళ్లది కాదు
చీకటిని శాసించే రాక్షసులది కాదు
ఆ రాక్షసుడిని ఆడించే రావణుడిది కాదు
రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది
గండ్ర గొడ్డలి పట్టిన యమ ధర్మరాజుది
మరణాన్నే వణికించిన మహారాజుది
డాకూ మహారాజ్
టైటిల్ రివీల్ చేయక ముందే టీజర్ లో ముగ్గురు విలన్లను రివీల్ చేశారు. డాకూ మహారాజ్ అనే టైటిల్ యాఫ్ట్ గా ఉండేలా గుర్రాలు, డ్రై ఏరియాలు.. కొండల్లో సీన్లు తీశారు. థమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం మాత్రం కొత్త కొత్తగా ఉంది. కొత్త సౌండ్స్ టీజర్లో వినిపించాయి. ఏదేమైనా బాలయ్య - బాబి సినిమా అంటే ఎలా ఉండాలో ఎంత మాస్ ఉండాలో టీజర్ .. టైటిల్ అలాగే ఉన్నాయి. రేపు సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉంది. ఈ సినిమాకు సమర్పణ సాయి సౌజన్య కాగా.. నిర్మాత సూర్య దేవర నాగవంశీ.