సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరో హీరోయిన్లు వచ్చి పోయినట్లుగానే చైల్డ్ ఆర్టిస్టులు కూడా వస్తూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ చిన్న వయసులోనే మంచి గుర్తింపును పొందుతూ ఉంటారు. ఇలా ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఒకప్పుడు ఇలా చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు.. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి రానిస్తూ ఉన్నారు.


 ఇంకొంతమంది మాత్రం చైల్డ్ ఆర్టిస్టులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత హీరోలుగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కూడా ఇలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ గురించే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కళాతపస్వి కే. విశ్వనాథ్ దర్శకత్వంలో 1987లో వచ్చిన స్వయంకృషి సినిమా గురించి తెలుగు సినీ ప్రేక్షకులు అంత తొందరగా మరచిపోలేరు. ఈ మూవీలో మెగా స్టార్ సరసన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది.


 అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మాస్టర్ అర్జున్ కి ఒక కీలకమైన పాత్ర దక్కింది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ పాత్రకు న్యాయం చేసిన మాస్టర్ అర్జున్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ లో పచ్చటి కాపురం సినిమాలోను నటించాడు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి గుర్తింపును సంపాదించుకున్నాడు మాస్టర్ అర్జున్. పెద్దవాడైన తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి ఉన్నత చదువులు చదివి.. అమెరికాలో డాక్టర్ గా సెటిల్ అయిపోయాడు. అయినప్పటికీ సంగీతంపై మక్కువ ఉండటంతో అప్పుడప్పుడు సంగీత కచేరీలు చేస్తూ ఉంటాడు మాస్టర్ అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: