ఈ క్రమంలోనే సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్తున్నారు.? ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? వీటన్నింటినీ కూడా మీడియా ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. అందుకే ఇలాంటి విషయం ఏది తెరమీదకి వచ్చినా కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన కపిల్ శర్మ షో గురించి ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. గతంలో కపిల్ శర్మ షో నుంచి నవజ్యోత్ సింగ్ సిద్దు అర్ధాంతరంగా నిష్క్రమించారు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆయన నిష్క్రమించాల్సి వచ్చింది అనే విషయంపై బాగానే చర్చ జరిగింది.
కానీ అసలు విషయం ఏంటి అనే విషయంపై మాత్రం ఎవరికీ ఒక క్లారిటీ రాలేదు. అయితే ఇలా కపిల్ శర్మ షో నుంచి నిష్క్రమించడంపై నవజ్యోత్ సింగ్ సిద్దు ఎట్టకేలకు మౌనం వీడారు. రాజకీయాల వల్లే తాను షో నుంచి వైదోలాగల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. అంతకంటే ఎక్కువ వివరించకూడదని అనుకుంటున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 2019లో సిద్దు ఈ షో నుంచి నిష్క్రమించడంతో అందరూ షాక్ లో మునిగిపోయారు. అయితే పుల్వామా దాడిపై ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు ఏ మతం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారగా.. ఇదే ఆయన షో నుంచి నిష్క్రమించడానికి కారణమని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.