నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే... ఆరుపదుల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా యంగ్ హీరోలకు సమానంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను వ‌స్తున్నాడు. అయితే బాలయ్య తన సినీ కెరీర్ లో ఓ పాత్ర కోసం ఎంతో పెద్ద సాహసమే చేశారు. అంతేకాదు ఆ పాత్ర కోసం ఎకంగా 10 రోజులు పాటు అన్నం కూడా తినలేదట. ఆ  ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తాము చేసే పనిని దైవంగా భావించి అంకితభావంతో పనిచేసే స్టార్ హీరోల్లో నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఎప్పుడు ముందు వరసలోనేే ఉంటారు. తాను చేసే పనిప‌ట్లల క్రమశిక్షణ, నిబద్ధతను తన తండ్రి నటరత్న ఎన్టీఆర్ దగ్గర నుంచి పునికి పుచ్చుకొని హిట్, ప్లాప్‌ల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా తాను చేసే సినిమాల్లో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు కూడా చేస్తూ మాస్ హీరోగా రాణిస్తున్న సమయంలోనే భైరవద్వీపం లాంటి జానపద సినిమాను కూడా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.


టాలీవుడ్ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ మన తెలుగులోనే ఓ గొప్ప కళాఖండంగా మిగిలిపోయింది . అయితే ఈ సినిమా గురించి ప‌లు ఆస‌క్తిక‌ర వార్త‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాస్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సమయంలోనే బాలయ్యకు భైరవద్వీపం సినిమా ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో కురూపిగా నటించడానికి ఉప్పు కొవడం మరోసాహసమనే చెప్పాలి. ఎందుకంటే ఆ సమయానికి రౌడీ ఇన్స్పెక్టర్ , నిప్పురవ్వ , బంగారు బుల్లోడు వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు బాలయ్య. అలాంటి సమయంలో సింగీతం శ్రీనివాసరావు భైరవద్వీపం కథతో బాలకృష్ణ వద్దకు వ‌స్తే ఆయ‌న‌ మరో ఆలోచన లేకుండా ఆ సినిమాకు ఓకే చేశారు .. అంతేకాకుండా కథలో భాగంగా కురిపుగా నటించటానికి కూడా సై అన్నారు. అలా బాలకృష్ణ ఈ సినిమాల కురూపీగా నటించడం ఓ గొప్ప సాహసమనే చెప్పాలి.


ఇక ఎందుకంటే ఆస‌మ‌యంలోనే బాలయ్యకు టాలీవుడ్ లో గ్లామర్ అండ్ స్టార్ హీరోగా మంచి క్రేజ్ ఉంది. అయితే బాల‌య్య‌ కాకుండా మరో హీరో అయితే ఆ క్యారెక్టర్ కు నో చెప్పేవారు . అక్కడ బాలయ్య కాబట్టి తాను చేయాలనుకుని చేయడానికి సై అన్నారు. ఇక అంతే కాకుండా ఆ కురుపి క్యారెక్టర్ కోసం బాలకృష్ణ పది రోజులు భోజనం లేకుండా అదే విధంగా ఆ క్యారెక్టర్ కు మేకప్ కొసం కనీసం రెండు గంటల సమయం పట్టేది .. ఒకసారి మేకప్ వేస్తే ఉద‌యం నూంచి సాయంత్రం వరకు తీయడానికి కుదరది కాదు కానీ భోజనం చేయాలంటే మేకప్ తియ‌ల్సిందే ఒకవేళ మేకప్ తీస్తే మళ్లీ రెండు గంటలు సమయం పట్టేది. అందుకే సమయం వృధా చేయకూడదని దాదాపు పది రోజుల పాటు కేవలం జ్యూస్లు తాగుతూ అన్నం తినకుండా ఆ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ విధంగా బాలకృష్ణసినిమా కోసం తన ప్రాణం పెట్టి నటించాడనే చెప్పాలి. అందుకే ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల హృద‌య‌ల్లో నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: