అయితే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అనే విషయంపై ఎన్నో ఏళ్ల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఇది కార్యరూపం దాల్చింది. తనదైన సినిమాలతో సెన్సేషనల్ విజయాలను సాధిస్తున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అటు మోక్షజ్ఞ మొదటి సినిమా చేస్తున్నాడు అనే విషయం ఇప్పటికే కన్ఫామ్ అయిపోయింది. అయితే ఇక ఈ మూవీలో తారాగణం ఎవరు నటించబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ఇందుకు సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చినా.. కూడా అదే ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది.
అయితే ఇప్పుడు స్టార్ హీరో బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడంటేనే.. భారీగా అంచనాలు ఉన్నాయి. అలాంటిది ఇక మోక్షాజ్ఞకు విలన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై కూడా అంచనాలు ఉండడం కామన్. ఇందుకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారిపోయింది. మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాలో మరో స్టార్ హీరో కొడుకు నటించబోతున్నారట. అది కూడా విలన్ గా. మోక్షజ్ఞ సినిమాలో విలన్ రోల్ కి తమిళనటుడు విక్రం తనయుడు ధ్రువ్ ని సంప్రదించారని భోగట్టా. ఇందుకు దృవ్ కూడా అంగీకరించాడట. ఇక ఈ మూవీలో హీరోయిన్గా రవినా టాండన్ కూతురిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ అందరూ తెగ మురిసిపోతున్నారు