ఎటువంటి డైలాగులు లేకుండా కుబేర గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా కనిపించబోతున్నారు. నాగార్జున కూడా ఇందులో చాలా ఒక డబ్బున్న వ్యక్తిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక ఎవరి కోసమో వెతుకుతూ ఉన్నట్టుగా చూపించారు. చివరికి ధనుష్ అయితే వైట్ అండ్ వైట్ పంచకట్టులో కనిపిస్తారు. అయితే సినిమా స్టోరీ కూడా బిచ్చగాడుగా ఉన్నటువంటి ధనుష్ చివరికి డబ్బు ఉన్న వ్యక్తిగా ఎలా మారిపోయాడు అనే కథాంశం అన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి సినిమా స్టోరీ అంతా కూడా రష్మిక, నాగార్జున, ధనుష్ చుట్టూనే తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. బిజిఎం కూడా దేవిశ్రీప్రసాద్ అదిరిపోయేలా కొట్టినట్లు గ్లింప్స్ చేసిన అభిమానుల సైతం తెలియజేస్తున్నారు.
మరొకసారి కుబేర చిత్రంలో ధనుష్ తన నటనతో ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా ఎప్పుడు విభిన్నమైన కథలతోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి కథని ఎంతో నమ్మారు కాబట్టే ధనుష్ నాగార్జున రష్మిక కూడా నటించారని అభిమానులు తెలియజేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ కి సంబంధించి ఎలాంటి విషయాలన్నీ అయితే తెలుపలేదు చిత్ర బృందం. ఈ మధ్యకాలంలో ధనుష్ కూడా సరికొత్త కథలతోనే అభిమానులను మెప్పించడానికి ట్రై చేస్తున్నారు అలా తానే సొంతంగా కథను రాసుకుంటూ సినిమాలను కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు ధనుష్.