వరుసగా పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే సైన్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్... కూడా విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కోసం ముగ్గురు వ్యక్తులు... భారీ నిర్ణయాన్ని తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి... హైదరాబాదులోని జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చారు.
ముగ్గురు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంద్రబాబు ఇలాక ఆయన కుప్పం నియోజకవర్గం నుంచి నడుచుకుంటూ హైదరాబాద్ వరకు చేరుకున్నారు. ఈ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని సమాచారం. అయితే ఈ ముగ్గురు హైదరాబాద్ రావడంతో వెంటనే తన ఇంటికి పిలిపించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా వారి పేర్లు అలాగే వివరాలు తెలుసుకొని... వారిని సన్మానించారు జూనియర్ ఎన్టీఆర్.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇలా నడవడం... కొత్తేమీ కాదు కానీ... ఆయన అంటే... ఎలాంటి త్యాగానికైనా ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇది ఇలా ఉండగా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్... కావడమే కాకుండా.. దాదాపు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టగలిగింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో నడుస్తోంది. అక్కడ కూడా జనాలు విపరీతంగా ఈ సినిమాను చూస్తున్నారు.