కరోనా సమయంలో విడుదలైన అఖండ, ఆ తర్వాత సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి, గతేడాది అక్టోబర్ 19 రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమాలతో బాలయ్య బాబు హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 సినిమాను చేస్తున్నాడు. దీనికి డాకు మహారాజ్ అనే పేరును కూడా ఖరారు చేశారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక ఏపీలో ఎన్నికలు రావడంతో బాలయ్య షూటింగ్ కు విరామం ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. బాలయ్య కెరీర్ ప్రారంభంలో ఇండస్ట్రీ హిట్ అందించిన సినిమా మంగమ్మగారి మనవడు. ఈ సినిమాకు దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు. మొదటగా బాలకృష్ణతో కాకుండా చిరంజీవితో ఈ చేయాలని అనుకున్నారట. ఆ సినిమా కథను చిరంజీవికి చెప్పడంతో అతను నచ్చలేదని చెప్పాడట.
దీంతో ఈ సినిమా కథను కోడి రామకృష్ణ బాలయ్యకు వినిపించగా వెంటనే బాలయ్య బాబు ఓకే చెప్పి సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. భానుమతి రామకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. సుహాసిని కథానాయికగా నటించింది. భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై ఎస్. గోపాల్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తిరుగులేని విజయాన్ని అందుకొని ఇండస్ట్రీ హిట్ కోట్టి బాలయ్య కెరీర్ లో మరపురాని సినిమాగా నిలిచిపోయింది.