ఇలాంటి సమయంలోనే న్యాయస్థానం ఇరువురి వాదనలను విన్న తర్వాత ఇద్దరినీ కలిసి మరొకసారి మాట్లాడుకోవాలని రాజీ చేయడానికి ప్రయత్నించాలంటూ సూచించిందట.. ఒకవేళ ఇద్దరు విడిపోవాలనుకుంటే అందుకు కరెక్ట్ గా కారణం కూడా కావాలని కోర్టు స్పష్టం చేసింది అందుకు సంబంధించి ఆదేశాలను కూడా జారీ చేసింది.. అయితే విడిపోవడం విషయం పైన కేవలం అటు ఆర్తీ, జయం రవి ఎవరి వాదనను వారు మీడియాతో తెలియజేస్తూ ఉన్నారు. వీరికి కోర్టు 6 నెలలు సమయం కూడా ఇచ్చిందట.
వీరిద్దరు విడిపోవడానికి గల బలమైన కారణాన్ని చెప్పాలి అంటూ హెచ్చరిస్తున్నది కోర్టు.. 2019లో వీరి వివాహం జరగకగా ఈ జంటకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు .వీరిద్దరి అంగీకారంతోనే తాము విడిపోతున్నట్లు ఈ ఏడాది సెప్టెంబర్ లో సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ విషయం పైన అటు అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా తాను తన భార్య ఆర్తీ ఎన్నో ఆలోచించే విడిపోవాలనుకున్నామని తెలియజేశారు జయం రవి. ఇద్దరు బాగుండాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు రవి. కానీ తన భార్య ఆర్తి మాత్రం పలు విషయాలను తెలియజేస్తూ తన అనుమతి లేకుండానే ఇలా విడాకుల వ్యవహారం గురించి ప్రకటించడం తనకి అసహనం వ్యక్తం అవుతుంది అంటూ తెలిపింది. మరి వీరికి ఇచ్చిన కోర్టు సమయానికి ఏం చేస్తారో చూడాలి.