శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్న కుబేర మూవీ పై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి.అయితే ఈ సినిమాలో విలన్ నాగార్జున అంటే చాలామంది ఈ సినిమా ప్లాఫ్ అనుకున్నారు. ఎందుకంటే హీరోగా చూసిన నాగార్జునని విలన్ గా అభిమానులు యాక్సెప్ట్ చేయలేరు అని అందరి ఉద్దేశం. కానీ ఈ సినిమా నుండి నాగార్జునకి సంబంధించిన పోస్టర్, గ్లింప్స్ అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దీంతో కుబేర మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలామంది కల్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. అయితే అలాంటిది ఈ సినిమా గురించి తాజాగా ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటయ్యా అంటే.. శేఖర్ కమ్ముల కుబేర స్టోరీని ఎప్పుడో రెడీ చేసుకున్నారట. అయితే ఈ స్టోరీ రెడీ చేసుకున్నాక ఓ మెగా హీరోతో ఈ సినిమా తీయాలి అనుకున్నారట.

 కానీ ఆ హీరో డేట్స్ ఖాళీగా లేకపోవడంతో చివరికి ఈ మూవీ ధనుష్ చేతికి వచ్చింది.మరి ఇంతకీ ఆ మెగా హీరో ఎవరయ్యా అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కుబేర స్టోరీ రాసుకున్నాక రామ్ చరణ్ కి ఈ స్టోరీ చెప్పారట శేఖర్ కమ్ముల. అయితే ఈ స్టోరీ రాంచరణ్ కి నచ్చి ఓకే చేద్దాం అని చెప్పారట.  అలా రామ్ చరణ్ హీరోగా నాగార్జున విలన్ గా సినిమా తెరకెక్కిద్దాం అనుకున్నారు.కానీ అదే సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్లో పడి అది విడుదలయ్యే వరకు లేట్ అయింది. అయితే ఈ సినిమా విడుదలయ్యాక రాంచరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు.ఇక గ్లోబల్ స్టార్ అయ్యాక రామ్ చరణ్ అన్ని పాన్ ఇండియా కథలే ఎంచుకుంటున్నారు.

దాంతో వెనకడుగు వేసిన శేఖర్ కమ్ముల చివరికి ధనుష్ కి స్టోరీ చెప్పగా ఆయనకు ఈ స్టోరీ బాగా నచ్చింది. అలా ధనుష్ ని హీరోగా నాగార్జునని విలన్ గా పెట్టి కుబేర మూవీని తెరక్కెక్కించినట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ అసలు గేమ్ ఛేంజర్ సినిమా ఎలా ఉంటుందో ఎవరికి అర్థం అవ్వడం లేదు. రామ్ చరణ్ కుబేర మూవీ ఒప్పుకుంటే బాగుండేది. మరో హిట్ ఆయన ఖాతాలో పడేది.ఇప్పటికే కుబేర మూవీ నుండి రిలీజ్ అయిన అన్ని అప్డేట్స్ చాలా బాగున్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్
మరి చూడాలి కుబేర మూవీ ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: