వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమ నుండి నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలుపడ్డాయి. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్
చెంజర్ సినిమా విడుదల కావడానికి రెడీగా ఉంది. అలాగే బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ విడుదల కానుంది. అలాగే వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబోలో రూపాందుతున్న సంక్రాంతికి వస్తున్నాం , ఈ సినిమాతో పాటు సందీప్ కిషన్ , త్రినాధ్ రావు నక్కిన కాంబోలో రూపొందుతున్న మజాకా సినిమా కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు రానుంది. 

ఇలా నాలుగు సినిమాలు వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల కావడానికి రెడీగా ఉండడంతో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు లభిస్తాయి అనే దానిపై అనేక వార్తలు వైరల్ అయ్యాయి. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని సినిమాల కంటే ముందు జనవరి 10 వ తేదీన గేమ్ చేంజర్ మూవీ విడుదల కానుంది. దానితో ఈ మూవీ కి మొదటి రెండు రోజులు భారీ ఎత్తున థియేటర్లో లభించనున్నాయి. ఆ తర్వాత డాకు మహారాజ్ సినిమా జనవరి 12 వ తేదీన విడుదల కానుంది. దానితో అందులో సగం థియేటర్లు ఈ సినిమాకు వచ్చే అవకాశం ఉంది. 

ఇక జనవరి 14 వ తేదీన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఆ తేదీ వరకు ఈ రెండు సినిమాలలో ఏ మూవీ కి మంచి టాక్ వస్తుందో దానికి థియేటర్లను ఎక్కువగా ఉంచి మిగతా సినిమాకు థియేటర్లను తగ్గించి వాటిని సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మజాకా సినిమా విడుదల తేదీపై క్లారిటీ లేదు. కాబట్టి ఈ మూవీ కి ఏ స్థాయిలో థియేటర్లు దొరికే అవకాశం ఉంది అనే దానిపై పెద్దగా క్లారిటీ లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: