-ఆర్ఎక్స్ 100 మూవీతో సంచలనం..
-ఒక్క హిట్టు కోసం అనేక పాట్లు..
- రొటీన్ కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో  బోరింగ్..

గుమ్మడికొండ కార్తికేయ.. ఈయన ఇంటిపేరు తో ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ఆర్ఎక్స్ 100 హీరో అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయారు నటుడు కార్తికేయ.. చదువుకునే సమయంలోనే నటుడు అవ్వాలని కలలు కన్నా ఈయన చదువు పూర్తవడంతోనే హైదరాబాద్ కు వచ్చి సినిమా అవకాశాల కోసం ట్రై చేశాడు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో చేసి మొదటిసారి ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాలో చేశారు. అయితే ఈ సినిమా పేరు ఎవరికి గుర్తులేదు. కానీ ఆ తర్వాత ఇదే బ్యానర్ లో వచ్చిన ఆర్ఎక్స్ 100 మూవీతో సంచలనం సృష్టించారు. మరి అలాంటి కార్తికేయ సినీ కెరీర్ లో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం..

 హిట్టు కోసం కార్తికేయ ఇబ్బందులు:

 ఆర్ఎక్స్ 100 మూవీ తో ఓవర్ నైట్ లో హీరోగా మారిన కార్తికేయ ఆ తర్వాత హిప్పీ, గుణ 369 అనే సినిమాల్లో చేశారు. అయితే ఈ సినిమాలు ఏవి అంతగా ఆడలేదు. ఆ తర్వాత నాని హీరోగా చేసిన నానీస్ గ్యాంగ్ లీడర్ మూవీ లో ప్రతి నాయకుడు పాత్రలో నటించారు. ఈ సినిమా లో కార్తికేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఆ తర్వాత 90ml,చావు కబురు చల్లగా,రాజా విక్రమార్క వంటి సినిమాల్లో కూడా నటించారు. అలాగే అజిత్ హీరోగా చేసిన వలిమై మూవీలో విలన్ పాత్ర పోషించారు. ఇక కార్తికేయ నటించిన బెదురులంక 2012 సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి హిట్టు కొట్టింది.అయితే ఈ సినిమా హిట్టవడంతో తన నెక్స్ట్ సినిమా అయినటువంటి భజే వాయువేగం మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.అయితే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్,టీజర్, గ్లింప్స్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.


దాంతో ఎంతోమంది అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్లకు సినిమా చూడడానికి వెళ్లారు. తీరా సినిమా చూస్తే రొటీన్ కథ,రొటీన్ ఎమోషన్స్ అనిపించింది. దాంతో సినిమా చూసే ప్రేక్షకుడిని ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.ఈ మూవీలో ఉన్న ఒకటి రెండు ట్విస్ట్ లు కూడా అందరూ ఊహించే లాగే ఉండడంతో ట్రైలర్, టీజర్ చూసి వావ్ అన్న జనాలే సినిమా చూసి బోరింగ్ అన్నారు. దాంతో భజే వాయు వేగం  మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ అయింది.ఇక ఈ మూవీ ప్లాఫ్ అవ్వడంతో కార్తికేయ తన నెక్స్ట్ సినిమాతో నైనా హిట్టు కొట్టి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ అందుకోవాలి అని ఎదురుచూస్తున్నారు.అయితే ఈయన ఎంచుకునే సినిమాల్లో కథ కంటెంట్ బాగా లేకపోవడం రొటీన్ కథలను ఎంచుకోవడంతో కార్తికేయ సినీ కెరియర్ స్లో అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఈయన ప్రేక్షకులను ఆకర్షించే కథలను ఎంచుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: