చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులను ఇండస్ట్రీ కోల్పోవడం జరిగింది.  పది రోజులకు ఒకరు చొప్పున... ఏదో ఒక కారణంగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు... మరణిస్తున్న సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా.. తమిళ చిత్ర పరిశ్రమంలో ఈ విషాదం చోటుచేసుకుంది.


తమిళ చిత్ర పరిశ్రమలో... యువ దర్శకుడు కన్నుమూశాడు. తీవ్ర అనారోగ్యంతో యంగ్ డైరెక్టర్ మరణించడం జరిగింది. అతని ఎవరో కాదు యువ దర్శకుడు సురేష్ సంగయ్య. తమిళనాడు చిత్ర పరిశ్రమలో... దర్శకుడు సురేష్ సంగయ్య కు మంచి పేరు ఉంది.  సక్సెస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు సురేష్ సంగయ్య... శుక్రవారం రాత్రి మరణించాడు. గత కొన్ని రోజులుగా ఆయన లివర్ సంబంధిత వ్యాధులతో... బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ వ్యాధి నయం చేసుకునేందుకు... చాలా ఆసుపత్రులకు తిరిగారట యువ దర్శకుడు సురేష్ సంగయ్య. కానీ ఎక్కడ కూడా... దీనికి సొల్యూషన్ దొరకలేదట. అయినప్పటికీ మెడిసిన్ వాడుతూ తన జీవితాన్ని గడిపాడు సురేష్ సంగయ్య. అయితే తాజాగా సురేష్ సంగయ్య.. ఆరోగ్యం విషమించడంతో... శుక్రవారం అర్ధరాత్రి 11:30 గంటలకు మరణించాడట. ఆయన శరీరంలో ఉన్న లివర్లు పూర్తిగా... చెడిపోయాయని... దీంతో ఆయన మరణించినట్లు చెబుతున్నారు.


యువ దర్శకుడు సురేష్ సంగయ్య మరణించడంతో...ఆయన కుటుంబంతో పాటు ఇండస్ట్రీ మొత్తం విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఇది ఇలా ఉండగా సురేష్ 2017 సంవత్సరంలో ఓరు కిడయిన్ కరుమన్ అనే సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం కావడం జరిగింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇది ఇలా ఉండగా దర్శకుడు సురేష్ సంగయ్య మరణం పట్ల తమిళ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు సంతాపం తెలుపుతున్నారు. ఇక ఆయన అంత్యక్రియలు ఇవాళ జరిగే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: