- నందమూరి ఫ్యామిలీ వంటి భారీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన కళ్యాణ్ రామ్..
- తమ్ముడు సపోర్ట్ తో మరింత ముందుకు..
- NKR 21 మూవీ పైనే ఆశలు..


సినీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంటే చాలు ఇండస్ట్రీకి వచ్చే ఏ హీరో అయినా హిట్టు కొడతారు అనుకుంటారు చాలామంది. కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు నటనా టాలెంట్ ఉండాలి అంటారు అభిమానులు.. అలా ఇప్పటికే ఎంతోమంది సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన హీరోలు కూడా ఇండస్ట్రీలో ఎదగలేకపోయారు.అలాంటి వారిలో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. అయితే కళ్యాణ్ రామ్ తన సినీ కెరియర్ లో ఎన్నో ఫ్లాప్ లను మూట కట్టుకున్నారు.ఇక ఇప్పుడిప్పుడే ఆయన కెరియర్ గాడిన పడుతుంది అనుకున్న సమయంలో అమీగోస్,డెవిల్ సినిమాతో మరోసారి ఆయన ఆశలు అడియాసలయ్యాయి..

 కళ్యాణ్ రామ్ సినీ కెరీర్:

నందమూరి హరికృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన కళ్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్ లో దూసుకుపోవాలని ట్రై చేస్తున్నారు. కానీ ఈయన నాలుగు సినిమాలు చేస్తే అందులో ఒక సినిమా హిట్టు మూడు సినిమాలు ప్లాఫు అనే విధంగా కెరీర్ కొనసాగుతోంది. అయితే ఆయన సినీ కెరియర్ ప్లాఫుల్లో ఉన్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య కు భారీ చేయూతనిచ్చారు.ఆయన సినిమాలకు సపోర్ట్ చేయడమే కాకుండా ఎన్టీఆర్ చేసే సినిమాలకు కూడా నిర్మాతగా పెట్టుకొని ఒక రకంగా ఆయన్ని ఇండస్ట్రీలో నిలబెట్టారు అని చెప్పుకోవచ్చు. అలా అన్నకి తమ్ముడు తమ్ముడికి అన్న సపోర్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ని వెలివేసిన నందమూరి ఫ్యామిలీ ఇప్పటికి కూడా దూరం పెడుతున్నప్పటికీ కళ్యాణ్ రామ్ మాత్రం తమ్ముడు వెంటే ఉంటున్నారు. ఇక అలాంటి కళ్యాణ్ రామ్ 2022లో బింబిసారా వంటి మూవీ తో మన ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేశారు.ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక బింబిసారా మూవీ జోరుతో అమిగోస్,డెవిల్ వంటి సినిమాలతో మన ముందుకు వచ్చారు.


ఇందులో అమిగోస్ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. అలాగే డెవిల్ మూవీ టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్లు అంతగా రాలేదు. దాంతో నిర్మాత, బయ్యర్లు నష్టపోయారు.అయితే బింబిసార వంటి భారీ హిట్ తర్వాత నెక్స్ట్ సినిమాలు హిట్ అవుతాయి అనుకున్న రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. దాంతో తన నెక్స్ట్ మూవీ ఎన్ కె ఆర్ 21 పైనే కళ్యాణ్రామ్ తన ఆశలన్నీ పెట్టుకున్నారు.. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ప్రస్తుతం కళ్యాణ్రామ్ తన 21వ సినిమాని చేస్తున్నారు. ఈ మూవీలో విజయశాంతి, శ్రీకాంత్ లు కీలక పాత్రలు చేస్తున్నారు. అలాగే సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ షూట్ కూడా పూర్తయింది.ఇక ఈ క్లైమాక్స్ సీన్ తెరకెక్కించడం కోసం దాదాపు 8 కోట్ల బడ్జెట్ తో 1000 మంది ఆర్టిస్టులతో ఈ సీన్ తెరకెక్కించారట.ఇక ఈ సీన్ షూట్ చేయడం కోసం ఒక ప్రశాంతమైన ప్లేస్ లో భారీ సెట్టు కూడా వేశారట.అలా ఈ సినిమా క్లైమాక్స్ కోసమే 8 కోట్లు ఖర్చుపెట్టారంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక కళ్యాణ్రామ్ అభిమానుల ఆశలు మొత్తం కళ్యాణ్ రామ్ నటిస్తున్న నెక్స్ట్ మూవీ పైనే ఉన్నాయి. మరి ఈ సినిమా నైనా కళ్యాణ్ రామ్ ఖాతాలో హిట్టు పడేస్తుందా లేదా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: