అయితే ఆయన నటించిన మటక సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఆ హీరో ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్స్ వరుణ్ తేజ్ పై వేస్తున్నారు . మరి ముఖ్యంగా అసలు ఆయన లాస్ట్ నటించిన నాలుగు సినిమాల్లో ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడం గమనార్హం అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ అసలు హిట్టే అందుకోలేదు అంటూ లావణ్య త్రిపాఠి ఐరన్ లెగ్ అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు . దీంతో లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ ఇద్దరు తెరపై భార్యాభర్తలుగా కలిసి నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . ఆల్రెడీ ఒక డైరెక్టర్ ఆమెకు ఈ సినిమా కథ చెప్పిన ఆమె అప్పుడే వద్దు అంటూ హోల్డ్ లో పెట్టిందట. అయితే వరుణ్ తేజ్ కి హిట్ పడాలి ..అప్పుడే ఆయనకు గౌరవం ఉంటుంది అన్న కారణం చేత లావణ్య త్రిపాఠి వెంటనే ఆ డైరెక్టర్ కి కాల్ చేసి కథను ఓకే చేసినట్లు అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసిందట. దీంతో లావణ్య త్రిపాఠి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది. చూద్దాం మరి వరుణ్ తేజ్ ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడో లేదో..???