టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య సినీ ప్రస్థానం మొదలై దాదాపుగా 16 సంవత్సరాలు అయింది. జోష్ సినిమాతో నాగచైతన్య సినీ కెరీర్ మొదలు కాగా ఈ సినిమా తర్వాత నాగచైతన్య ఎన్నో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే సమంతతో విడాకుల తర్వాత చైతన్య కెరీర్ మరీ ఆశాజనకంగా లేదు. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలు సక్సెస్ సాధించినా ఈ సినిమాలు నాగచైతన్య కెరీర్ కు మరీ ప్లస్ కాలేదు.
 
అదే సమయంలో థాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ సినిమాలతో నాగచైతన్యకు భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాను మించి మరొకటి నష్టాలను మిగిల్చాయనే చెప్పాలి. దూత వెబ్ సిరీస్ లో నటించి సక్సెస్ సాధించినా ఆ వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజైన వెబ్ సిరీస్ అనే సంగతి తెలిసిందే. నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
 
నాగచైతన్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నాగచైతన్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. నాగచైతన్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా పాన్ ఇండియా స్థాయిలో చైతన్య సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చైతన్య యాక్టింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
 
నాగచైతన్య తండేల్ తో బాక్సాఫీస్ మోత మోగే రెంజ్ హిట్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాగచైతన్య తన లుక్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం. నాగచైతన్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగచైతన్య తండేల్ తో ఫిబ్రవరి 7వ తేదీన బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. నాగచైతన్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: