అయితే వీరి పెళ్లి ఎటువంటి హడావిడి లేకుండా చేసుకోవడంతో అభిమానులు సైతం కాస్త ఆత్యా రేపు పోతున్నారు. అయితే వీరిద్దరి వివాహం గురించి కూడా ఏ సెలబ్రెటీలు కానీ టాలీవుడ్ సింగర్స్ కానీ ఎటువంటి పోస్టులు కూడా చేయలేదు. తెలుగు సినీ పరిశ్రమలో వీరు ఎన్నో పాటలు కూడా పాడారు. అనురాగ కులకర్ణి కూడా పాడిన పాటలన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఆర్ఎక్స్ 100లో పిల్లరా.. అలాగే c/o కరచపాలెం సినిమాలో ఆశాపాశం పాటలు కూడా మంచి విజయాన్ని అలరించాయి.
రమ్య బెహర్ విషయానికి వస్తే ఈమె సూపర్ సింగర్ ఫోర్ లో పాల్గొనింది బాహుబలి, టెంపర్, లౌక్యం, ఇస్మార్ట్ శంకర్ తదితర చిత్రాలలో కూడా ఈమె పలు రకాల పాటలు పాడిందట. ఇలా ఇద్దరు కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా అనురాగ్, రమ్య వివాహం చేసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేసిన" హె రంగులే సాంగ్" కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఈ పాట యూట్యూబ్లో కూడా భారీగానే వ్యూస్ ని రాబడుతోంది. మొత్తానికి ఈ టాలీవుడ్ టాప్ సింగర్స్ సైలెంట్ గా వివాహం చేసుకోవడం వెనుక కథని తెలియజేస్తారేమో చూడాలి.