ఒకప్పుడు హీరో గా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , కమీడియన్గా , హీరోయిన్లకు తండ్రి గా , మామగా నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు .. అయితే ఇప్పుడు దివంగత చంద్రమోహన్ - ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి ఎవరికీ తెలియ‌ని ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయట కు వచ్చింది . అదేమిటో ఇక్కడ తెలుసుకుందాం .


సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తో అటు చంద్రమోహన్ కు ఇటు  కె . విశ్వనాథ్ కీ కూడా మంచి బంధుత్వం ఉండేది . ఆ బంధుత్వం ఎలాంటిది అంటే చంద్రమోహన్ బావమరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు . అలా వీరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది . అలానే మరోవైపు చంద్రమోహన్ కి , కె విశ్వనాథ్ గారి తో కూడా బంధుత్వం ఎలా ఏర్పడింది అనే విషయానికి వస్తే .. తన పెదనాన్న కొడుకే  విశ్వనాధ్ అన్ని చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు . అలా వీరీ మధ్య కూడా అన్నదమ్ముల బంధం ఏర్పడింది .


ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సీతామహాలక్ష్మి , సీత కథ , సిరిసిరిమువ్వ , శంకరాభరణం వంటి సినిమాలు వచ్చి మంచి విజ‌య‌లు అందుకున్నాయి. ఇకపోతే గతంలో కూడా విశ్వనాథ్ గురించి చంద్రమోహన్ మాట్లాడుతూ.. సినిమా బంధం కంటే మా ఇద్దరి మధ్య కుటుంబ బంధమే ఎక్కువగా ఉంది . మద్రాస్ లో ఉన్నప్పుడు ఒకే చోట స్థలం కొని .. పక్కపక్కనే ఇల్లు నిర్మించుకొని 25 సంవత్సరాలు ఉన్నాము అంటూ చంద్రమోహన్ వెల్లడించారు . ఇక అలా వీరు ముగ్గురు చంద్రమోహన్ , కే విశ్వనాథ్ , ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా అన్నదమ్ములు కావడం విశేషం,. అంతేకాదు వీరి ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన శంకరాభరణం సినిమా కూడా తెలుగు చిత్ర పరిశ్రమ లోనే ఓ గొప్ప సినిమాగా మిగిలిపోయింది .

మరింత సమాచారం తెలుసుకోండి: