యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఈ సంచలన రికార్డ్ ఫ్యాన్స్ కు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇప్పట్లో ఏ స్టార్ హీరో ఈ రికార్డును బ్రేక్ చేయలేరని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర సినిమా 52 కేంద్రాలలో 50 రోజుల పాటు ప్రదర్శితమైంది. ప్రస్తుత కాలంలో ఇన్ని థియేటర్లలో 50 రోజులు ప్రదర్శితం కావడం అంటే సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.
దేవర1 మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు ఓటీటీలో సైతం సంచలనాలను సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమాకు ఏకంగా 2.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే ఓటీటీలో ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టైందో అర్థమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీ 156 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.
దేవర మూవీ 50 రోజుల సెలబ్రేషన్స్ సైతం అంగ రంగ వైభవంగా జరిగాయని తెలుస్తోంది. దేవర సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచి మంచి లాభాలను అందించింది. దేవర రిజల్ట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాలకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది. మాస్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయడం తారక్ కు మాత్రమే సాధ్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి.